తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నుంచి ప్రధాన నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.. ప్రస్తుతం ఆయన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన  టీడీపీ వర్గీయుల అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు..టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి వెళ్లి మంత్రి పదవి అనుభవిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈ విషయంలో తాము యాక్షన్ తీసుకోవడానికి లేదని.. కాని స్పీక్పర్ ఏదో ఒక చర్య తొందరగా తీసుకోవాలని సూచించింది. తాజాగా తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని విలేఖరులతో మాట్లాడుతూ.. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎందుకు అని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమైనా రాజీనామా చేశారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్


2014 సార్వత్రిక ఎన్నికల్లో సనత్ నగర్ నుంచి తలసాని టిడిపి తరఫున గెలవడం, ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయిన నేపథ్యంలో  గత కొంత కాలంగా తలసాని రాజీనామాపై రగడ కొనసాగుతూనే ఉంది.. తలసాని రాజీనామా ఎందుకు చేయలేదని గతంలో టిడిపితో పాటు విపక్ష సభ్యులు ప్రశ్నించారు. దానికి తలసాని.. తాను రాజీనామా చేశానని వివరణ ఇచ్చారు. అయితే నాయిని చేసి వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి తలసాని రాజీనామా చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: