బాహుబలి.. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన ఈ సినిమా ఇప్పుడు రాజకీయనాయకులు, అధికారుల నోళ్లలోనూ నానుతోంది. ఈ సినిమాను కోట్ చేస్తూ మాట్లాడటం ఇప్పుడో ఫ్యాషన్ అయ్యింది. ఈ సినిమాలోని పాత్రలు కూడా అంతగా పాపులర్ అయ్యాయి మరి.

చంద్రబాబు సర్కారు 2400 కోట్ల రూపాయల వ్యయంతో ఈ-ప్రగతి ప్రాజెక్టును విశాఖలో ప్రారంభించారు. దీనిపై ప్రముఖులు కామెంట్ చేస్తూ సినిమాల్లో బాహుబలిలో సర్కారు పథకాల్లో ఈ – ప్రగతి ప్రాజెక్టు అలాంటిదని ప్రశంసలు కురిపిస్తున్నారు.. రాష్ట్రంలో అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ – ప్రగతి ప్రాజెక్టు  లక్ష్యం.

ఈ ప్రాజెక్టు ప్రారంభ సభలో ప్రసంగించిన ఏపీ సాంకేతిక సలహాదారు జె.సత్యనారాయణ .. ఇది బాహుబలి వంటి ప్రాజెక్టు అంటూ సినీ భాషలోనే చమత్కరించారు.  ఈ-ప్రగతి ప్రాజెక్టుకు సీఎం నిర్మాత, తాను దర్శకుడినని, విప్రో, సిస్కో తదితర భారీ కంపెనీలు ఇందులో కీలకపాత్ర పోషించాయని కామెంట్ చేశారు.

ఇదే సభలో మాట్లాడిన నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ కూడా చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనూ లేరని ప్రశంసించారు. చంద్రబాబు ఏపీలో ఉన్నారు కాబట్టే ఇక్కడకు ఐటీ కంపెనీలు వస్తున్నాయని విశ్లేషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: