రైతులు అదనపు ఆదాయ సంపాదన కోసం పాలు, గుడ్ల ఉత్పత్తిలోకి ప్రవేశించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ గుడ్ల దినం 
సందర్భంగా విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఏపీ రైతులకు ఈ విలువైన సందేశమిచ్చారు. రోజు 
రోజుకూ వ్యవసాయంలో లాభాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో అదనపు ఆదాయం కోసం ప్రత్యామ్నాయ విధానాలు చేపట్టాలని బాబు సూచించారు. రైతులు పాలు, గుడ్ల 
ఉత్పత్తిలో పాలు పంచుకుంటే అదనపు ఆదాయం పెరుగుతుందన్నారు. 


ఈ సందర్భంగా, గుడ్డు ఉత్పత్తులపై పరిశోధనలు నిర్వహించాలని, గుడ్డుతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించాలని చంద్రబాబు సూచించారు. 
గుడ్ల ఉత్పత్తి రంగంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి సూచించారు. నిజానికి పాల ఉత్పత్తిలో కూడా మన రాష్ట్రం మంచి 
స్థానంలోనే ఉంది. కానీ ప్రభుత్వ రంగంలో ఉండే డెయిరీలను సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో తన హెరిటేజ్ డెయిరీ వ్యాపారం ఒక్కటే దివ్యంగా జరిగేలాగా.. కుట్రలు 
పన్నారనే ఆరోపణలు చంద్రబాబు మీద పుష్కలంగా ఉన్నాయి. దానిక తగ్గట్లే ప్రభుత్వం రంగంలో ఏపీలో డెయిరీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి ఉన్నది. అందుకే 
ఇవాళ ఆయన రైతులకు పాలబాట చూపించినా కూడా అదేదో ఆయన తన డెయిరీ లాభాలను పెంచుకోవడానికి, చేస్తున్న ప్రయత్నంగా జనం అనుకుంటారే తప్ప.. 
చిత్తశుద్దితో జనం కోసం చేస్తున్న ప్రయత్నంగా ఎవ్వరూ నమ్మడం లేదు. గుడ్ల వాడకం గురించి కూడా చంద్రబాబు హితవులు చెబుతోంటే.. చంద్రబాబు హెరిటేజ్ 
త్వరలోనే గుడ్ల సంబంధిత అనుబంధ వ్యాపారాల్లోకి అడుగుపెడుతుందేమో అనే భయం కొందరికి కలుగుతోంది. 


అంతా బాగుంది. రైతులకు సీఎంగారి సలహాలూ బాగున్నాయి. నీళ్లకు కరువైన రాష్ట్రంలో, పశువులకు మేత కూడా కరువైన రాష్ట్రంలో.. పల్ల్లెల్లో తిండిగింజలు కరువైన 
రాష్ట్రంలో, అప్పులు తీరని, కొత్త అప్పులు దొరకని రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం గురించి చేసే ఈ ఉద్బోధ కాసింతయినా ఫలితాలను ఇస్తుందా అన్నదే 
సందేహం. 


మరింత సమాచారం తెలుసుకోండి: