తెలంగాణలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది..ఒకపైపు ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ తెస్తామని హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.. మరో వైపు రుణమఫీ విషయంలో, ప్రకృతి వైపరిత్యాలు వల్ల నష్టాల బాటలో వెళుతున్న రైతన్న నైరాశ్యానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు గందరగోళం చేశాయి.  తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నివారించేం దుకు రైతులపై ప్రభుత్వ మొండివైఖరి... ఏకకాలంగా రుణాలు మాఫీ చేయా లంటూ యావత్ విపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి.

పలు డిపోల ఎదుట ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తిసుకున్నారు. భారతదేశానికే ఆహారధాన్యాలు అందించి 'అన్నదాతలు'లుగా పేరున్న తెలంగాణాలో రైతులు దుర్బరజీవితాన్ని గడుపుతున్నారని, చేసిన అప్పులు తీర్చలేక, ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోవడంతో పేరుకుపోయిన అప్పులు, వడ్డీలు చెల్లించలేక అన్నంపెట్టే రైతన్నలు పిట్టల్లారాలిపోతున్నారని, వారికి భరోసా కల్పించడం, రైతు వ్యతిరేక ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు జరగుతున్న  బంద్ సందర్భంగా తెల్లవారకముందే రోడ్లపైకి వచ్చిన విపక్ష నేతలే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బంద్ కోసం రోడ్లపైకి వచ్చిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

జెండాలను పక్కనపెట్టి… ఇతర ఎజెండాలను వెనక్కి పడేసి ఏకైక లక్ష్యంతో బద్ద శత్రువులుగా ఉండే తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా ఒక్కటయ్యాయి. న్ని పక్షాలు నిర్వహిస్తున్న బంద్‌కు విద్యా, వ్యాపార, వాణిజ్యవర్గాలు కూడా తమతమ మద్దతు ప్రకటించాయి. టిడిపి, బిజెపి ఉమ్మడిగా, కాంగ్రెస్‌, వామపక్షాలు వేర్వేరుగా రైతు యాత్రలు నిర్వహించాయి.   సిపిఎం, ఆర్‌ఎస్పీ, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ నేతలు తమ్మినేని వీరభద్రం, జానకిరాములు, కె గోవర్దన్‌, వేములపల్లి వెంకట్రామయ్య ఎండి గౌస్‌ ఆర్టిసి క్రాస్‌రోడ్డులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముషిరా బాద్‌ డిపో వద్ద బిజెపి పక్షనేత డాక్టర్‌ కె లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

బంద్ తో ఖాళీగా రోడ్లు

Oppn jointly calls for Telangana bandh on farmers' issues

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ నేతృత్యంలో ఆ పార్టీ నేతలు ఎంజీబిఎస్‌ వద్ద ఆందోళన చేశారు. బంద్‌ సందర్భంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఎంజీబీఎస్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకుందుకు ప్రయత్నిస్తున్న టీపిసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి, దానం నాగేందర్ లను అదుపులోకి తీసుకొని అక్కడి నుండి తరలిస్తున్నారు. మెహదిపట్నంలో షబ్బీర్ అలీ ని అరెస్ట్ చేసిన పోలీసులు, జూబ్లి బస్సు స్టాండ్ వద్ద రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, ఎల్ రమణ తదితరులను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు.తాము కూడా రైతు పక్షమే అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా చేతులు కలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: