అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కేపిటల్ ప్రమోషన్ ఈవెంట్ గా చంద్రబాబు రూపుదిద్దుతున్నారు. దేశ, విదేశాల నుంచి అతిధులను ఆహ్వానించి.. ఏపీ సత్తా ఏంటో చూపించాలని తాపత్రయపడుతున్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుబడుల సాధనకు ఓ మార్గంగా మలచుకుంటున్నారు. అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అత్యంత భారీగా ఈ కార్యక్రమం డిజైన్ చేస్తున్నారు.

అమరావతి శంకుస్థాపన కోసం అద్భుతమైన వేదికను రూపొందిస్తారట. వేలాదిగా జనం హాజరైనా ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తున్నారట.  రాజధాని కోసం భూములిచ్చిన 29గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ప్రయరిటీ ఉంటుందట. వేదికా స్థలంలో మొత్తం  ఆరు గ్యాలరీలు ఏర్పాటు చేస్తారట. ఇందులో వీవీఐపీలకు రెండు.. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లకు ఒకటి, వీఐపీలకు ఒకటి, రైతులకు ఒకటి, రాజధాని నగరం ఏర్పాటుకానున్న 29 గ్రామాల ప్రజలందరికీ కలిపి ఒకటి కేటాయిస్తారు. 

ప్రధాన వేదికకు ఏ వైపున కూర్చున్నా వేదికపైన ఉన్న ముఖ్యులు కనిపించేలా గ్యాలరీలు కడతారట. ప్రతి గ్యాలరీలో 500 నుంచి వెయ్యి మంది కూర్చునేలా మరో 5-6అనుబంధ గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్యాలరీల్లోకి ఎంటర్ అవ్వాలంటే మస్ట్ గా పాస్‌ ఉండాలట. 50 వేల కుర్చీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

శంకుస్థాపన వేదిక వద్ద రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు మాత్రం వీఐపీ ట్రీట్ మెంట్ ఉంటుందట. వారి కోసం స్పెషల్ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు. అక్కడ భూమి ఇచ్చిన యజమానిని కూర్చోబెట్టి సర్కారు సన్మానం చేస్తుందట. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలతో సత్కరిస్తారట. ఈ ప్లాన్ కు సినీ హంగులు కూడా తోడవటంతో.. ఆంధ్రా రాజధాని అమరావతి శంకుస్థాపన ఈవెంట్ మహా గ్రాండ్ గా జరగబోతోందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: