ఏడవ తరగతి నుంచే అర్ధం పర్ధం లేని ప్రేమలతో మైకం లో జోగుతున్న జనాలు. ప్రేమకీ , వాంఛ కీ, మోజు కీ , కామానికీ తేడా లేకుండా అన్నిటికీ ప్రేమ అనే ట్యాగ్ లైన్ తగిలించి బతుకుతున్నారు. నిజానికి  అమ్మా నాన్నా లేకపోతే కాదు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నే అనాథ అన్నట్టు చూసే ఈ ప్రపంచానికి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఉండే సదుపాయాలూ, సంతోషాలూ ఏంటో ఇది చదివాక మీరే చెప్పండి 


1. ఆ పిల్ల ఎక్కడ ఉంది ఎవరితో మాట్లాడుతోంది, ఇంకెవరికైనా పడిపోతుందా లాంటి భయాలు లేకుండా శుభ్రంగా, ప్రశాంతంగా నిద్ర పోయే  స్థితి లో ఉంటారు మీరు. జీవితం లో తొంభై శాతం టెన్షన్ లు గర్ల్ ఫ్రెండ్ వలన మాత్రమె వస్తాయి అనడం లో సందేహం లేదు. ఇప్పటికే రేలషన్ లు ఉన్న వారికి ఇది తెలిసిన విషయమే కూడా

2. టెన్షన్ లేని జీవితం లో బోలెడంత సమయం ఆదా అవుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా దుబారా ఖర్చులు పోయే అవకాశమే లేదు. ఆమె పుట్టిన రోజు దగ్గర నుంచీ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల పిల్లల్ని పెట్టిన రోజు వరకూ అన్నీ గుర్తుపెట్టుకుని చాక్లెట్లో, నెక్లెస్ లో కొనాల్సిన పని లేదు. ఆ డబ్బంతా ఏ ఫిక్సెడ్ డిపాజిట్ లోనో తోసేస్తే భావిష్యత్తు లో పెళ్లి చేసుకుంటే కొడుకు/కూతురు స్కూలు ఫీజు కట్టడానికైనా మిగుల్తాయి అన్నట్టు .. 

3. నేనెలా ఉన్నాను, ఇవాళ ఆ అమ్మాయి కి నచ్చుతానా? నచ్చక పోతే తిడుతుందేమో.. అంత అందగత్తె పక్కన నీను చూడడానికి బాగోకపోతే ఎలా ?" ఇలాంటి కష్టాలు ఏవీ లేని స్థితి ఇది. హాయిగా మనకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడకి పోవచ్చు 

4. అర్ధ రాత్రి రెండు గంటలకి మిస్సిడ్ కాల్ ఇచ్చి మనం ఎవరితోనో మాట్లాడుతున్నామా లేక పడుకున్నామా అని స్పై చేసే అవకాశం ఉండదు. నిద్ర లోంచి లేచి వారికి ఎదో గుర్తొస్తో కబుర్లు చెప్పి బుజ్జగించి నిద్ర పోగొట్టుకుని రాత్రంతా తలనొప్పి తో పడుకోవాల్సిన అవసరం ఏముంది ?

5. ఫోన్ లు 24 గంటలూ ఫ్రీ ఉండే సిమ్ కార్డ్ తీసుకుని సరికొత్త అఫార్ లు వేయించుకుని ఉండాల్సిన అవసరమే లేదు. ఎసేమేస్స్ ఆఫర్ లూ , వాట్స్ యాప్ ఆఫర్ లూ ఇలాంటి తలకాయ నొప్పులకి ఛాన్స్ లేనే లేదు. ఎర్ర బటన్ పచ్చ బటన్ లతో పనైపోతుంది 

6. రోజంతా ఫోన్ మాట్లాడీ మాట్లాడీ సెల్ ఫోన్ లో చార్జింగ్ నీ , సిమ్ కార్డ్ లో బాలన్సు నీ అవగోట్టేసుకోవాల్సిన పనేం ఉండదు. రోజుకి ఒకే ఒక్క సారి చార్జింగ్ పెట్టి, వారానికి ఒక యాభై రూపాయల టాక్ టైం వేయించుకుంటే రోజులు గడిచిపోతాయి 

7. " మొన్న "రాధ" తో మాట్లాడుతూ కనపడ్డావు .. అంతకు ముందు రోజే మీరిద్దరూ లైబ్రరీ లో ఎదో నవ్వుకుంటున్నారు .. ఏంటి సంగతి నాకు చెప్పకుండా ఏం నడుపుతున్నావు? " ఇలాంటి తలనొప్పి ప్రశ్నల కి తావే లేదు. ఎవరితో కావాలంటే వారితో ఎప్పుడైనా ఏదైనా మాట్లాడచ్చు. 

ఇంకేం .. ఇన్ని శుభ పరిణామాలూ , తేలికగా బతుకుని వెళ్లదీసే అవకాశాలూ ఉన్నాయి కాబట్టి proud to be single అని గర్వంగా చెప్పెసుకోండి. అలాగని జీవితం లో సహధర్మ పత్ని రాకూడదు అని కాదు. సరైన వయసులో సరైన సమయం లో మన ప్రేరణ లేకుండా కలిగేదే ప్రేమ .. మన అనుమతి లేకుండా మన జీవితం లోకి వచ్చేదే మన " జీవిత భాగ స్వామి " ఆమె కోసం ఎదురు చూడండి .. ఇలోగా సింగిల్ కింగ్ లాగా లోకాన్ని ఎలేయండి ..


మరింత సమాచారం తెలుసుకోండి: