ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఎమ్మెల్సీ అయినప్పటి నుంచీ విమర్శలు చేస్తూ వచ్చిన బీజేపీ నేత సోము వీర్రాజు ఈ మధ్య కాలం లో విమర్సల స్థాయిని బాగా పెంచేశారు. చంద్రబాబు పాలన తీరు మీద తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తిన వీర్రాజు. పోలవరం విషయం లో గానీ, ఇతర విషయాలలో కానీ ఈ మధ్య రెండు రోజుల నుంచీ ఆయన దుప్పెత్తి పోస్తున్నారు.


బీజేపీ - టీడీపీ ల మధ్య స్నేహం మంచిగా సాగుతున్న సమయం లో ఆయన ఇలా మాట్లాడ్డం ఆసక్తికరంగా మారింది.మొన్నటి వరకూ ఎదో మాటవరస కి బాబు మీద విరుచుకు పడే సోమూ ఈ మధ్య ఆయన్ని కడిగేస్తున్నారు. దీని అంతటి వెనకా పవన్ కళ్యాణ్ హస్తం ఉందా అనేది పరిశీలకుల వాదన. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అయిన సోమూ వీర్రాజు అసలు ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నది పవన్ కళ్యాణ్ వల్లనే. పవన్ గట్టిగా సిఫార్సు చేస్తేనే ఆ కోటా లో ఆయనకీ పదవి దక్కింది అంటూ ఉంటారు.

సోమూ వీర్రాజు ఇలా చంద్రబాబు మీదా


పవన్ కళ్యాణ్ కి కటవుట్ లాంటి సోమూ వీర్రాజు ఇలా చంద్రబాబు మీదా ఆయన సర్కారు మీద ధ్వజం ఎత్తడం వెనక ఎలాంటి ఆలోచన ఉంది అసలు వారి ప్లాన్ ఎంత అనేది తెలుసుకోవాల్సిన అంశంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ సోమూను పవన్ నియంత్రించాలని అనుకొంటే అది పెద్ద విషయమే కాదు! అంతే కాదు.. కొంచెం తగ్గితే సోమూకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.


అలాంటి మంత్రి పదవి దక్కే అవకాశాన్ని వదులుకుని కూడా ఇలా సోమూ ఎందుకు రెచ్చిపోతున్నారు అనేది భారీ ప్రశ్న గా మారింది. ఏవో రాజకీయ సమీకరణలు లేకపోతే ఊహించని రీతిలో ఎందుకు మిత్రపక్షం తో గొడవకి సై అంటారు ? తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఈ విషయం లో పవన్ కళ్యాణ్ నే తప్పు పడుతున్నారు. ఆయన మాట విని ఎమ్మెల్సీ ఇప్పిస్తే ఆయన తోనే తమమీద కయ్యానికి కాలుదువ్వుతున్నాడు పవ్వాన్ అనేది వారి ఆరోపణ.



మరింత సమాచారం తెలుసుకోండి: