తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హారం కాస్తా ఆ పార్టీకి న‌ష్టం క‌లిగించేలా ఉంద‌నే చెప్పాలి. అప్ప‌నంగా వ‌చ్చే ఎమ్మెల్యే సీటు చేజేతులారా వ‌దిలించుకుంది. ఎలాగంటారా.. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌టోళ్ల కిష్టారెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం తో నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క వ‌ర్గానికి ఉప ఎన్నిక ఖ‌రారు అయ్యింది. అయితే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణిస్తే వారి ఇంట్లో వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రిని, రాజ‌కీయ వార‌సులుగా ఎన్నుకునే  ప్ర‌జాస్వామ్యం మ‌న‌ది. ఇప్ప‌టికీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతుంది. కానీ తాజాగా  నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క వ‌ర్గంలో మాత్రం ఇది సాధ్యం అయ్యేలా క‌న‌ప‌డటం లేదు. దీనికి కార‌ణం ఏమిటా అని చెప్పుకుంటే ముమ్మాటికి కాంగ్రెస్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి ఏక‌గ్రీవం ఇష్టంలేదా? లేక గెలుపు పై ధీమానా తెలియ‌దు గానీ.. నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క వ‌ర్గంలో సానూభూతి కోటాలో ఏక‌గ్రీవంగా సొంతం చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతున్న ప‌రిస్థితి మాత్రం క‌నిపిస్తోంది. 


ఇలా కాంగ్రెస్ ఎందుకు వ్య‌వ‌హ‌రించిందన్న విష‌యం 


నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక  ఏక గ్రీవంగా పూర్తి చేద్ధామ‌నే ప్ర‌తిపాద‌న కాంగ్రెస్ పార్టీ చేయ‌లేదు. ఇలా కాంగ్రెస్ ఎందుకు వ్య‌వ‌హ‌రించిందన్న విష‌యం ఇప్ప‌టికి ఆర్ధం కానీ ప‌రిస్థితి. లేక ఎలాగో నియోజ‌క వ‌ర్గంలో కిష్టారెడ్డి కి సానుభూతి ఉంది. దానిని ఆస‌రా చేసుకుని ప్ర‌త్యక్ష పోటిలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ పై గెలిచి త‌మ స‌త్తా చాటాల‌ని చూస్తుందా? ఒకవేళ అలాంటిదే జరిగితే నారాయ‌ణ ఖేడ్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు త‌ధ్య‌మేనా అన్న‌ది కొంత వ‌ర‌కు అలోచించాల్సిన విష‌యం. ఇక‌పోతే.. ప్ర‌స్తుతం అధికార పార్టీ రైతు ఆత్మ‌హ‌త్యల‌పై కొంత వ‌ర‌కు విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా రైతుల ఆత్మ‌హ‌త్య‌ల వ్య‌వ‌హారం కాస్తా అధికార పార్టీకి త‌ల‌నొప్పిగానే మారింది. రైతు రుణమాఫీ విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన‌ కాంగ్రెస్ పార్టీ ఈ విష‌యంలో గ‌ట్టిగానే పోరాడుతుంది. 


రైతు రుణ‌మాఫీని ఏక‌కాలంలో చెల్లించాల‌ని డిమాండ్  చేస్తూ.. ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌ట్టే ప‌నిలో ప‌డింది కాంగ్రెస్. దీంతో ప్ర‌జ‌ల్లో కొంత‌వ‌ర‌కు ఆద‌ర‌ణ ల‌భించడంతో కాంగ్రెస్ పార్టీ గ‌ట్టి ధీమాతోనే ఉంద‌ని తెలుస్తోంది. ఇక నారాయ‌ణ ఖేడ్ ఉపఎన్నిక‌లు సైతం ప్ర‌జ‌ల్లో ప్ర‌త్య‌క్ష పోటిలో దిగాల‌ని ఆలోచ‌న‌లో ఉంది. ఎది ఎమైనా కాంగ్రెస్ కాన్పిడెన్స్ కొంత వ‌ర‌కు న‌మ్మినా.. కొంత అప‌న‌మ్మ‌కమే చెప్పాలి. ఇది ఇలా ఉంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం నారాయ‌ణ ఖేడ్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం కూడా దాదాపు ఖాయం అయ్యింది. ఇక్క‌డ నుంచి త‌మ అభ్య‌ర్థి పోటీలో ఉంటాడ‌ని.. ఈ స్థానాన్ని గెలుచుకుని తీర‌తామ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆధినేత, ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత రైతు ఆత్మ‌హ‌త్య‌ల  స‌మ‌స్య‌ల‌తో కొంత ఓటు శాతం త‌గ్గినా, అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపు మాత్రం ఖాయ‌మ‌నే చెప్పాలి.


వాస్తవానికి నారాయ‌ణ ఖేడ్ నియోజ‌వ‌ర్గం ఎన్నిక ఏక‌గ్రీవమేన‌ని అధికార ప్ర‌భుత్వంతో స‌హా అంద‌రు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ తీరుతో అది కాస్తా ఉప ఎన్నిక‌ల‌కు దారితీసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మ‌రణిస్తే వారి ఇంట్లో వాళ్ల‌లో లేక పార్టీలో ఎవ‌రో ఒక‌రిని, రాజకీయ వార‌సులుగా ఎన్నుకుంటారు. ఇప్పటికి ఈ సంప్ర‌దాయం మన ప్ర‌జాస్వామ్యం లో కొన‌సాగుతుంది. అయితే తెలంగాణలోని నారాయ‌ణ ఖేడ్ నియోజ‌వ‌ర్గంలో మాత్రం జ‌రిగేలా లేదు. ఈ నియోజ‌క వ‌ర్గాన్ని సానుభూతి కోటాలో ఏక‌గ్రీవంగా సొంతం చేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ విఫ‌ల‌మ‌య్యింది. నారాయ‌ణ ఖేడ్ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక‌ను ఏక‌గ్రీవంగా పూర్తిచేద్దామ‌నే ప్ర‌తిపాద‌న కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి త‌మ ఎమ్మెల్యే చ‌నిపోయాడ‌ని.. ఆయ‌న కుటుంబీకుల‌ను ఏక‌గ్రీవంగా గెలిచేలా చేద్దామ‌ని వీరు కోర‌డం లేదు.


కాంగ్రెస్ పైపు నుంచి ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌నేదీ రాక‌పోవ‌డంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎన్నిక‌ల‌కు సిద్ధం అయిపోతోంది. ఇక ఇంత‌వ‌ర‌కు కాంగ్రెస్ పైపు నుంచి ఉలుకూ ప‌లుకు లేదు. ఈ ప్ర‌తిపాద‌న చేయాల్సిన సీఎల్సీ అధ్య‌క్షుడు జానా రెడ్డి మారు మాట్లాడ‌టం లేదు. అసెంబ్లీలో సంతాప తీర్మానం స‌మ‌యంలోనే ఈ ప్ర‌తిపాద‌న‌ చేయాల్సింద‌ని కిష్టారెడ్డికి నివాళి ఘ‌టించే స‌మ‌యంలోనే జానా రెడ్డి ప్ర‌తిపాద‌న చేయాల్సింద‌ని అప్పుడే టీఆర్ఎస్ స్పంద‌న అడిగి ఉంటే.. ఆ పార్టీ మొహ‌మాటం కొద్దీ అయినా ఒప్పుకునేద‌ని కాంగ్రెస్ నేత‌లంటున్నారు. ఒక‌వేళ అధికార టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోక‌పోతే.. అది కూడా ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజి క‌లిసి వ‌చ్చేది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎక్కువ కాలం ఎమ్మెల్యే గా, మంత్రిగా ప‌నిచేసిన అనుభవం క‌లిగిన జానా రెడ్డి కి ఈ విష‌యంలో ఎందుకు జాప్యం చేశాడ‌న్న‌ది అనుమాన‌మే. 


ఇన్ని విష‌యాల‌ను తెలిసినా  కానీ జానా రెడ్డి మాత్రం ఇవేమీ ప‌ట్ట‌న‌ట్టుగా ఉన్నారు. మ‌రి నారాయ‌ణ ఖేడ్ ఉప ఎన్నిక అటూ ఇటూ అయ్యి.. అది కాస్తా కాంగ్రెస్ చేజారితే అది ఖ‌చ్చితంగా ఆ పార్టీ నాయ‌క‌త్వ వైప‌ల్య‌మే అవుతుంద‌న‌డానికి సందేహం లేదు. కాంగ్రెస్ గెలుపు ధీమానా లేక ఇంత పెద్ద పార్టీ అయ్యి ఉండి ఒక సీటును అడ‌గ‌టం ఎందుక‌ని మొహ‌మాటానికి వెళ్లిందా లేక  కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం కావాల‌నే ఇలా చేసిందా? తెలియ‌దుగానీ ముమ్మాటికి త‌ప్పుచేసింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: