తెలంగాణ 60 యేళ్ల ఉద్యమం.. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్రం..ఇప్పుడు ఈ రాష్ట్రంపై ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు...ఆయన ఎవరో కాదు మాజీ  కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్. మైకులు దొరికితే చాలు రాజకీయ నాయకులు ప్రసంగాల్లో ఆవేశంతో పూనకం వచ్చినట్లు మాటలు మాట్లాడి పార్టీకి తంటాలు తీసుకొస్తుంటారు. తాజాగా కాంగ్రెస్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సభలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యల పైన టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.


వరంగల్ జిల్లా నర్సంపేటంలో కాంగ్రెస్ నేతలు ఓసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో, బలరాం నాయక్ తోపాటు ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని.. ఈసారి కనుక కాంగ్రెస్ ను గెలిపించకపోతే ‘తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తామని’ నోరు జారారు. అక్కడే ఉన్న సీనియర్ నాయకులంతా ఒక్కసారి తెల్ల మొఖం వేశారు.


కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు.. రైతు సమస్యలు మాట్లాడటానికి వెళ్లి ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ మాటలు తెలంగాణవాదుల్లో బాంబు పేల్చినట్లు అవుతుందని సంకట స్థితిలో పడ్డారు. వెంటనే ఆయన వైపు అందరూ సీరియస్ గా చూడటంతో..సర్దుబాటు చేసుకొని తన ఉద్దేశ్యం అది కాదని అన్నారు. దీంతో బలరాం తేరుకొని జస్ట్ జోక్ చేశా అంటూ కవర్ చేసుకున్నారు.

బలరామ్ నాయక్ మాటలకు ఖంగు తున్ని భట్టి, జానా


ఒకసారి నోరు జారిన తరువాత ఆమాటలు వెనక్కి రావు కదా.. ఇప్పుడు బలరాం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మంచి సాకు దొరికినట్లే కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఇచ్చినంత మాత్రాన వారికి ఊడిగం చేయాలా తెలంగాణ ప్రజలు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు...దీంతో కాంగ్రెస్ వారి కుట్రలు బయట పడ్డాయిన అంటూ  టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నారు. అసలే అంతంత మాత్రం ఉన్న కాంగ్రెస్ ఉనికికి బలరాం వ్యాఖ్యలతో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: