శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ తామే ఏదో సాధించబోతున్నట్లు ప్రకటించుకొంటున్న విపక్షాలన్నీ ఒక్కటి అయినట్లే మనకు కనపడుతున్నా... అసలు సమస్యలు అలాగే వున్నట్లు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. జగన్ దీక్షకు ఇతర విపక్షాల నాయకులు కూడా తమంతగా తమ వద్దకు వచ్చి మద్దతిస్తున్నారని సంతోషపడిపోయి ఈ విధంగానైనా ప్రత్యేకహోదా సాధిస్తారేమోననే ఆశలు అడియాశలు అయినట్లే కనిపిస్తున్నాయి. 

వారు వచ్చి మద్దతిస్తున్న మాట వాస్తవమే గానీ.. పాలక పక్షం నేత చంద్రబాబుకు చురకు లేవయడానికి తాము తిడుతున్న తిట్లు పాపం.. మూడురోజులుగా అన్నాహారాలు మానేసి దీక్ష చేస్తున్న జగన్ కు కూడా తగులుతాయని వారు గుర్తించినట్లు లేదు. దీనికి నిదర్శనంగా.. సీపీఎం కు చెందిన మాజీ ఎంపీ మధు జగన్ దీక్షాశిబిరాన్ని సందర్శించి.. అక్కడ మాట్లాడుతూ మాకు పోరాటాలు ఎజెండా తప్ప.. తమకేమీ వ్యాపారాలు లేవని సెలవిచ్చారు. ’వ్యాపారాలు‘ అనే మాట ద్వారా ఆయన ఎవరిని దెప్పి పొడిచారో తెలియడం లేదు. హెరిటేజ్ చంద్రబాబు మీద కూడా ఆయన చూపు ఉండవచ్చు గానీ.. రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు హెరిటేజ్ కూరగాయలు, పాల వ్యాపారం మీద సెటైరు కంటే.. జగన్ కు ఉన్న సిమెంటు వ్యాపారం.. పరిశ్రమల వ్యాపారం, ఇన్ ఫ్రా వ్యాపారాల మీద కూడా ఇది సెటైర్ అయి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు.  ఒక విధంగా చూసినట్లైతే వ్యాపారాలు చేస్తున్న రాజకీయ నేత ఎవరు అంటే ఎవరైనా ఠక్కున చెప్పేది... మన జగనన్న పేరే ... మరి మధు గారు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసారోనని అక్కడే జనాలు చెవులు కొరుక్కొంటున్నారు.


వీరి విమర్శల గొడవల్లో పడి మళ్ళీ ప్రత్యేక హోదా సాధన అనే విషయం ఎక్కడ పక్కదారి పడుతుందోనని ప్రజలు తలలు పట్టుకొంటున్నారు.  ఎవరి వ్యాపారాలు ఏమైనా మాకు రావల్సింది మాకు వస్తే చాలు భగవంతుడా... అని మొర పెట్టుకోవడం మినహా మన చేతుల్లో ఏముంది అనుకొంటున్నారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: