తెలుగు రాష్గ్రాలు ఏర్పడిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక వేదికపై చాలా అరుదుగా కలిసారు.. ఇక ఓటుకు నోటు కేసు అనంతరం ఇద్దరి మద్య మాట యుద్దం కొనసాగింది. ఒక సందర్భంలో గవర్నర్ విందుకు పిలిచినా కూడా వెళ్లకుండా ఉన్నారు.. తాజాగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలవబోతున్నారా అంటే అవుననే చెప్పాలి.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ను తానే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానన్నారు చంద్రబాబు.

ఈనెల 22న మధ్యాహ్నం 12.45 గంటలకు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మందిని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డును ఆవిష్కరించారు. ఈ కార్డును చూస్తుంటే ఏపీ ప్రభుత్వం దీనిని చాలా చక్కగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. పూర్ణకుంభం చిత్రంతో కూడిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం తరఫున ప్రధాని మోడీకి ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తూ దీనిని రూపొందించారు. కేసీఆర్‌తో పాటు గవర్నర్‌,చీఫ్‌ జస్టిస్‌లకు స్వయంగా ఆహ్వానం అందజేస్తానని చంద్రబాబు మంత్రులకు తెలిపారు.  

గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్, చంద్రబాబు


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గతంలో ఇరువురు కలిసి ఒకే పార్టీలో పని చేసిన దృష్ట్యా చంద్రబాబు... కెసిఆర్‌కు ఎలా ఆహ్వానం పలకనున్నారనే చర్చ సహజంగానే సాగుతోంది.  చంద్రబాబు కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. శనివారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం విజయవాడలో భేటీ అయింది. ఈ భేటీలో రాజధాని శంకుస్థాపనకు ఎవరెవరిని ఆహ్వానించాలి, ఎలా ఆహ్వానించాలనే దాని పైన చర్చించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: