తెలంగాణా రాష్ట్ర రాజధాని మునుపెన్నడూ లేనంతగా రోజు రోజుకూ మెట్రో పోకడలు నెత్తిమీడకి ఎక్కించుకుంటూ తిరుగుతోంది. ఇదివరకో ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నప్పుడు కూడా పబ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ మధ్య విడిపోయిన తరవాత ముంబై, డిల్లీ నగరాలతో పోటీ పడే స్థాయి లో హైదరాబాద్ నైట్ లైఫ్ రెచ్చిపోతోంది.


పబ్ హెవెన్ గా పేరుగాంచిన బెంగళూరు ని సైతం త్వరలో తోసి రాజేసే స్థాయి లో హైదరాబాద్ లో పబ్ లు పెరిగిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఈ మధ్య జరిగిన ది పార్క్ పబ్ లో ఫాషన్ ఈవెంట్ ఫుల్ హాట్ హాట్ గా సాగడం దీనికి ప్రత్యేక ఉదాహరణ. ముంబై డిజైనర్లు ర్యాంప్ మీద మోడల్స్ ని తమ డిజైన్ లతో హొయలు ఒలికించేలా చేసారు. మోడ‌ల్స్‌కి థీటుగా ఈ నైట్ ప్రోగ్రాంకి హాజ‌రైన పేజ్ త్రీ పీపుల్‌, పార్టీ ప్రియులు... షార్ట్ డ్రెస్సుల‌తో కుర్రకారు కిక్ పెంచారు. సిటీ లోని మీడియా మొత్తం గత రాత్రి అక్కడే కొలువుతీరింది. నిర్విరామంగా కెమెరాలకు పనిచెప్పారు హాట్ జనాలు. ఫోటో గ్రాఫర్ లు సైతం ఎక్కడ ఏ అందాన్ని మిస్ అయిపోతామో అన్నట్టుగా అద్భుతంగా ఒక్కొక్క అందాన్నీ తమ కెమెరాల్లో బంధించే పనిలో పడ్డారు.


ఆఫ్టర్ పార్టీ మరింత రంజుగా సాగింది


శుక్రవారం మొదలు అయిన ఈ మూడు రోజుల వేడుక కి కింగ్ ఫిషర్ బీరు బ్రాండు అంబాసిడర్. నలభై అందమైన మోడళ్ళు పాల్గొన్న ఈ కార్యక్రమం లో ఆఫ్టర్ పార్టీ మరింత రంజుగా సాగింది అని చెప్పాలి, మీడియా కెమెరాలను అనుమతించని ఈ చోట ఈవెంట్ స్పాన్సర్లు సిటీ కి చెందినా విభిన్న రంగాల సంపన్నులతో డాన్సులు వెయ్యడం అదోకరకంగా సాగింది. ఈ తరహా ఈవెంట్ లు హైదరాబాద్ కి పబ్ కల్చర్ ని మరింత దగ్గర చేసి ఆర్ధికంగా మేలు చేస్తాయి అని కొందరు వాదిస్తుంటే యువతని పెడదోవ పట్టించే విధంగా ఇవి ఉన్నాయి అని మరికొందరు వాదిస్తున్నారు. అభివృద్ధి తో పాటు మనకి చేరువయ్యే ప్రతీ దాన్నీ భరించాల్సిన అవసరం ఉందేమో !!

మరింత సమాచారం తెలుసుకోండి: