ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారు..ఈ  దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా   స్పందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, ఆ దీక్షకు సంబంధించి ఎప్పటికప్పుడు 'సమాచారం' సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వుంటుంది.దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి, ప్రతిపక్ష నేత ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేంత తీరిక లేదు.  


విపక్ష నేత జగన్ కు ఆరోగ్యానికి సంబందించి ఎపి మంత్రులు వివాదస్పద ప్రకటన చేసిన నేపధ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి తదితరులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను నిలదీశారు.సుగర్ లవెల్స్ విషయంలో మంత్రులు జగన్ పై ఆరోపణ చేశారు.అయితే దీనిపై టిడిపి అనుకూల మీడియా దుష్ప్రచారం చేసిందని సాక్షి మీడియా పేర్కొంది.గుంటూరు ఆస్పత్రి డాక్టర్ లు ఎందుకు హెల్త్ బులెటిన్ లు విడుదల చేయలేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.


ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ ను చంపేందుకు ఎపి ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్న అనుమానాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితిపై తప్పుడు నివేదికలు తయారు చేసి,ఆయనను చంపేందుకు మంత్రులు కుట్ర పన్నుతున్నారన్న సందేహం వస్తోందని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు.

నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్


జగన్ ఆరోగ్యాన్ని కాపాడవలసిన మంత్రులు మాట్లాడుతున్న తీరు ఈ అభిప్రాయం కలిగిస్తున్నాయని రాజన్నదొర వ్యాఖ్యానించారు. కాగా గత నాలుగు రోజుల పరీక్షల నివేదికలు డాకర్లు చెప్పడం విశేషం.మంత్రులు పుల్లారావు ,కామినేని శ్రీనివాస్ లు జగన్ దీక్షను బోగస్ అంటూ వ్యాఖ్యలు చేసిన నేపద్యంలో ఇది వివాదం అయింది. దీనిపై జగన్ తో పాటు , మిగిలిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జగన్ ఆరోగ్య పరిస్థితి గమనించి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: