ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత ఆరు రోజుల నుంచి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరాహార దీక్ష చేస్తున్నారు..  ప్రభుత్వం నిరాహా దీక్షను పట్టించుకోవడం లేదని ప్రజా పక్షాన నిలిచిన నేతన పట్ల ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అంటూ ప్రభుత్వంపై ప్రధాన రాజకీయ పక్షాలు విరుచుకు పడుతున్నాయి. మరోవైపు బాబు మీద.. తెలుగుదేశం పార్టీ నేతల మీద పంచ్‌లు వెస్తు బూతులు తిట్టే రోజా పాపం ప‌వ‌న్ కళ్యాన్‌ను కూడ వ‌ద‌ల‌లేదు. భూసేకరణ అంశం మీద ఉన్న మక్కువ ఏపీకి ప్రత్యేక హోదా పై ఎందుకు లేదు..అని అన్నారు.

అనంతపురంలో రైతుల ఆత్మహత్య విషయంలో కానీ.. ఎమ్మార్వో వనజాక్షి పై జరిగిన దాడి కావొచ్చు.. ఇలా ఏ అంశం మీదా పవన్ స్పందించలేదని ఇప్పుడు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిరాహార దీక్షపై కూడా ఇప్పటి వరకు పవన్ కూడా స్పందించ లేదని ప్రజా పక్షాన నిలుస్తాని ప్రజలకు హామీ ఇచ్చి..ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారుని ఆమె అన్నారు.  ప్రశ్నించడానికే వచ్చానన్న జనసేన నేత సోషల్ సైట్లోనే తప్ప ప్రజల సాక్షిగా ప్రశ్నించరా అని ఆమె పవన్‌ ని నిలదీశారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ, చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఇందుకు పవన్‌ కల్యాణ్‌ సాక్షిఅని ఆమె గుర్తుచేశారు

నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్

ఓపక్క తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. తాను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పదే పదే పవన్ చెప్పుకుంటున్నా.. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ దీక్షపై స్పందించక పోవడం శోచనీయం అన్నారు.  పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలుకోట్లుకొల్లగొడుతున్నారని వీటన్నింటిపైనా పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీస్తున్నారు. అంతేకాదు ప్రత్యేక హోదా కోసం గుంటూరు నల్లపాడులో జగన్‌ 6 రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షకు పవన్‌ మద్దతు తెలపాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: