దాంపత్య జీవితంలో బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్త పడాలి.


అందుకు మీకోసం మా చిట్కాలు :  

 

1. ఎన్ని పనులున్నప్పటికీ కనీసం రోజుకు ఆరు గంటల నుండి 8 గంటల సేపు హాయిగా నిద్రపోవాలి.


2. క్లోస్ ఫ్రెండ్స్ తో ఉల్లాసంగా గడపాలి. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవడంతో ఒంటరితనం పెరిగుతోంది. అందుకే వారానికి ఓ సారైనా పార్కులకు, రెస్టారెరెంట్ లకు వెళ్ళి మిత్రులతో ఉల్లాసంగా గడపాలి. మానసిక భయాలకు ధూరంగా ఉండాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి.


3. భార్యా- భర్తల మధ్య లేనిపోని అనుమానాలకు తావు లేకుండా చూసుకోవాలి. అనుమానాల వల్ల మానసిక ఆందోళనకు గురై లైంగిక ఆసక్తి తగ్గుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల జీవితం సుఖమయమవుతుంది.  


4. ఇంటికి.. ఆఫీసుకు దూరం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ప్రయాణంలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల ఇంటికి వచ్చేసరికి అలసిపోయి శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది.


5. ప్రస్తుతం మారిన జీవన శైలికి అనువుగా వైద్యనిపుణులు దానిమ్మపండ్లు, ఆక్రూట్, ఓట్స్ శక్తినిస్తాయని చెబుతున్నారు. అలాగే మసాలాలు, ఘాటుగా ఉన్న ఆహారం తీసుకుంటే కూడా కోరిక కలుగుతుంది.  


6. రోమాన్స్లో ఇంట్రస్ట్ని పెంచడంలో ఆహారం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఒకప్పుడు మాంసాహరం సెక్స్ కోరికలను పెంచుతుందని నమ్మేవారు. పెళ్లయిన కొత్త దంపతులతో నేతితో చేసిన మినప సున్నండలు తినిపించేవారు. వాటిలోని పోషక విలువలు లైంగిక పటుత్వాన్ని పెంచుతాయని నమ్మేవారు.


7. ప్రతి రోజు ఒక గంట లేదా అరగంట సేపు వ్యాయమం తప్పనిసరిగా చేయాలి. వాకింగ్, స్విమ్మింగ్, షటిల్ వంటి వ్యాయామాలు మంచివి. ఏ వ్యాయామాన్నైనా మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలి. యోగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి చిట్కాలతో మీ దాంపత్య జీవతాన్ని బలపరచుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: