మిమ్మల్ని పరుగు లెత్తించే ఆధునిక వృత్తి జీవితంలోనుంచి రోజుకు కొన్ని క్షణాలైనా మాయమై, మిమ్మల్ని మైమమరపించే  ప్రవృత్తి జీవితం లోకి లేదా మిమల్ని తన్మయపరచే ఏ ఇతర వ్యాపకంపైకైనా మీ మనసును కేంద్రీకరించండి.  ఉల్లాసమిచ్చే ప్రకృతి లోకైనా  తొంగిచూసి  మనసుని మైమరపించుకోండి. అలాచేయటం వలన మీ మనసు కోరుకునే  ఉల్లాసం,  మీ తను వంతా ఉత్సాహంతో నింపుతుంది. ఈ ఉత్తేజిత “తన్, మన్”  ను మీ పని నిలిపితే నైనా  పెడితే మీకు  సత్వర  విజయాలు  లభించి ఫలితంగా “ధన్”  కావలసినంత  జమౌతుంది.


 

దీనికి మీరు చేయవలసిందంతా మీ మనసును మీరు రోజువారి ఉద్యోగం పేరిట మీరు చేసే  “గాడిద శాకిరి”  నుండి  కొన్ని క్షణాల కోసం దారి మళ్ళించటమే.  మళ్ళించిన మనసుని  ‘ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్’  వైపు నడిపించండి,  మైమరపించండి.  తనను తాను మరచిన మనసు ఎటో వెళ్ళిపోయి తిరిగి తిరిగి వచ్చి ఉత్తేజితమై మీరు “కష్టపడి” చేసే పనిని “ఇష్టపడి”  చేసేలా చేస్తుంది.  ఇదే మీలో సృజనను నింపి చేసే పని లో సృజనాత్మకత తోడై అద్భుతమైన  “ప్రోడక్ట్ “  బయటకు వస్తుంది.  మీ మనసును ఉల్లాశపరిచే అంశాలు ఏమైనా కావచ్చు.

 

                                                                               

ఒక మంచి సినిమా             

ఒక మంచి ఆట లేదా గేము (వ్యసనం కాకూడదు)

ఒక మంచి చిత్రలెఖనం, నృత్యం, గానం, కవితలల్లటం

అర్ధాంగితో పడకపై ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్.

లేదా,

 

మృదుమధురమైన సంగీతం వెన్నెల రాత్రిలో నింగిలో చందమామ పున్నమి వెలుగులు చిమ్మేటప్పుడు మెత్తటి సంగీతాన్ని ప్లే చేసి వినటం అదీ హిందుస్థానీ అయితే మనసుకు మజా ఇస్తుంది.


 

హరిప్రసాద్ చౌరాసియా - ఫ్లూట్; అక్బర్ అలీఖాన్ - సరోద్; బిస్మిల్లఖాన్ - షహనాయి; శివకుమార్ శర్మ - సంతూర్ లాంటి రక రకాల మంద్రమైన సంగీతం వింటూ మీమనస్సు లో మనొహరమైన ఊహలు గుసగుసలాడిస్తే ..... అడవిలో చెట్ల ఆకుల మధ్య చిటపట చినుకుల సౌందర్యం, పక్షుల కిలకిలారావాల కోలాహలం, కొండలపై నుండి దుమికే సెలయేళ్ళ సుమధుర గలగలారావం, నదీమత ల్లి ఒడిలో ప్రేయసి తో పడవ ప్రయాణం ఇలా తలుచుకుంటే ఆ దృశ్యాల సమాహారం మనోయవనికపై కదలాడుతుంటే వీనులవిందైన సంగీతం మనసంతా నిండితే ఆ ఆనందమే వేరు. రోజులో కొంత సమయమైనా ఇలా గడిపిచూస్తే ...... మీ వృత్తి మీకు భారం కాదు మనసు ఆ పనిపై లగ్నమై కష్టమైన పని ఇష్టమౌతుంది.....



 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: