అందమైన అతివలు శృంగారంలో మాత్రం తెలివిగల మహిళల కంటే వెనకబడి ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమే అంటున్నారు. అమెరికాలోని ప్రముఖ అధ్యాపకులు వెయ్యిమంది అతివలపై చేసిన అధ్యయనంలో తెలివైన మగవల్లో శృంగార చాతుర్యం ఎక్కువగా ఉన్నట్లు గమనినట్లు వెల్లడించారు. అంతేకాకుండా భాగస్వాములను పూర్తిగా తృప్తి పరిచేందుకు అవసరమైన అన్ని ద్వారాలను వారు అన్వేషిస్తారని తేలిసింది. దీన్నిబట్టి తెలివి గలవారై ఉండటం వల్ల చదువు, కెరీర్‌లో ఉన్నత స్థానానికి రావడమే కాదు దాంపత్య జీవితంలోనూ ఉన్నతంగానే ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు. ఈ అద్యాయనంలో పాల్గొన్నవారికి ఓ ప్రశ్నావళిని అందించారు  అధ్యయానకారులు. ప్రశ్నావళిలో వివిధ దశలలో భావప్రాప్తికి గురయ్యే టైంతోపాటు "అసలు సెక్స్ సుఖాన్నే అనుభవించలేకపోతున్నాను" వంటివాటిని చేర్చారు. సర్వేలో పాల్గొన్న మహిళలు పత్రాలను పూర్తి చేసిన తర్వాత వాటిని పరిశీలించారు. చిత్రంగా ఆయా వృత్తులలో ఉన్నత స్థానాలలో ఉన్న తెలివిగల మహిళలు మాత్రమే తాము పూర్తిగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తెలిపారు. పాట్ననర్ ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా తెలివిగల మహిళకు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇక చురుకుగా లేని మహిళలు తరచు భాగస్వామితో గొడవలు పడటం జరుగుతుండటాన్ని గమనించామన్నారు. సర్వే చేపట్టిన మహిళల్లో 40 శాతం ఇటువంటి వారున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: