పురుషుడిలైంగిక ప్రేరణకు మూలసాధనం ‘‘ స్త్రీ ’’ ఈ స్త్రీ పురుషుల ఆకర్షణ, లైంగికేచ్ఛ రతి లేకుండా సృష్టే లేదు. ఈ ఆకర్షణ, లైంగికేచ్ఛ కారణంగా స్రీ పురుషులు ఒకటైనప్పటికీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే జిజ్ఞానం తీరదు. ఒకరి శరీరం గురించి ఒకరు ఇంకా లోతుగా తెలుసుకోవాలనే కోరిక ఉధృతమవుతుంది. దేహంయెక్క రహస్యం అద్భుతమైనది. శరీరానికి స్పర్శయయెక్క భాష మనసు కూడా వేరుగా వుంటుంది. స్పర్శలో క్షణాల్లో అర్థం మారిపోతుంటుంది. పెద్దల స్పర్శలోని అర్థాన్ని పిల్లలు ఇట్టే పసికట్టగలరు. పెద్దల గురించి తెలసుకోవాలనే కోరిక వారిలో ఎక్కువ అవుతుంది. తాము ఎక్కడ నుండి వచ్చాము? తమకు తెలియకుండా తల్లిదండ్రుల చాటుమాటుగా ఏం చేస్తుంటారు ? ఇదే ప్రశ్నలు పిల్లలు తల్లిదండ్రులను అడిగితే మౌనంగా ఉండటం లేక పిల్లలను కసురుకోవడమో జరుగుతుంది. ఈ క్షణం నుండే పిల్లలలో అదేదో అడగకూడదని, చెప్పకూడనిదై వుంటుందనే భావన కలుగుతుంది. అలాగని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమూ సాధ్యం కాదు. దీనికి ఏదైనా నమ్మలేని ‘ కథ ’ చెప్పినా పిల్లలు త్వరగాన అది అబద్దం అని గ్రహిస్తారు మన దేశంలో శీలం... అశ్లీలం... అంటూ దేహసంబంధమైన, సెక్స్ సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ఎవరూ ముందుకురారు. యవ్వన ప్రాయంలోకి అడుగుపెడుతున్న పిల్లలకు తన తల్లి లేదా అక్క నెలలో మూడు రోజులు మూలన ఎందుకు కూర్చుంటుంది .? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అదే విషయాన్ని అడిగితే సరియైన సమాధానం రాదు. లేదా తనను చూసి జాలిపడటమో లేక కోప్పడటమో జరుగుతుంది. యదార్థానికి ఇలాంటి అనుమానాలను సానుకూలంగా వివరించి చెప్పాల్సిన బాధ్యత పెద్దలపై వుంది. కొద్దిపాటి విసుగు ప్రదర్శించినా మొత్తం విషయమంతా చెడిపోయి పిల్లవడి మనసులో అపోహలు చోటు చేసుకుంటాయి. ఇలాంటి విషయాలను వివరించి చెప్పటం వలన అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రస్తుతం సినిమాలలోచ టీవీల ప్రసారాలలో శృంగరం మిక్కుటంగా కన్పిస్తోంది. ఇలాంటి సన్నివేశాలు చూస్తున్న పిల్లలు అనేక ప్రశ్నలు వేస్తుంటారు. తాము చూసిన సన్నివేశాలను, సంఘటనలను అనుకరించాలని ప్రయత్నిస్తుంటారు. ఒక తెలిసీ తెలియని వయసులో వున్న అమ్మాయికి ప్రేమ అంటే ఏమిటి? అనే అనుమానం వచ్చింది. అయితే ప్రేమ గురించి కూతురికి విడమరిచి చేప్పే ధైర్యం మన దేశంలో ఎందరు తల్లులకు ఉంటుంది.? ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవకుండా ఉండేందుకై ఎలా ప్రవర్తించాలి. ఏ విధంగా లైంగిక తెలియజేయాలి అనే విషయమై విదేశాలలో అనే పరిశోధనలు జరిగాయి.పలితంగా 1966 తరువాత డెన్మార్క్ లో విద్యార్థుల కోసం స్కూలు పుస్తకాలలో, దినపత్రికలలో లైంగిక అంశాలను ప్రచురించాడు. ఇంకా లైంగిక విషయాలను తెలియచెప్పటానికి తల్లిదండ్రులకంటే అధ్యాపకులే సరియైనవారుగా భావించటం జరుగుతుంది. యవ్వనప్రాయంలోని విధ్యార్థులకు టీచర్లు... చేతులు, కాళ్ళు, చెవి, ముక్కలాగానే, అంగము, యోనిలు కూడా అవయాలేనని స్కర్టు, నిక్కరు మాటున దాచిన వాటి నిర్మాణం, పనితనాల గురించి తెలియచెప్పటం జరుగుతుంది. నిజంగా డెన్మార్క్ విద్యార్థులు అదృష్టవంతులు వారికి ఫిజిక్స్ కెమిస్ట్రీ, భూగోళం వంటి సబ్జెక్టులలాగానే సెక్స్ ను కూడా స్కూళ్లలో భోదిస్తారు. అక్కడి దినపత్రికలు కొందరు సెక్స్ స్పెషలిస్టుల సహాయంతో ఒక సెక్సు కాలంను కూడా ఇస్లుంటాయి. అలాగని డెన్మార్క్ లోని సెక్స్ గురించి ఏదో విప్లవం చెలరేగింది అనుకోనవసరం లేదు. అది పిల్లలకుగల సహజమైన సెక్స్ అనుమానాలు తీర్చడానిక, శరీర లక్షణాలు తెలసుకొనేందుకు మాత్రమే అని గమనించాలి. ఒకసారి అమెరికాలోని ఒక స్కూల్లో పిల్లలకు బ్లూఫిల్మ్ చూపించటం జరిగింది. మన దేశంలో సెక్స్ గురించి పిల్లలకు తెలియజెప్పటంపై ఇంకా ఆంక్షలున్నాయి. దీరివల్లనే ఇప్పటికీ పిల్లలలో, యౌవనప్రాయంలోని వారికి వచ్చే అనుమానాలు, సమస్యలు సమస్యలుగానే వుండిపోతుంటాయి. ఇంతగా గుప్తంగా రహస్యంగా ఉంచబట్టే పిల్లలకు ఆసక్తి వాటిపై అధికంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్నిసంపాదించటానికి ప్రక్కదారులు పట్టడం జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: