యుక్తవయసులో లైంగిక అవగాహన ఏర్పడితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఆ వికాసం వారిలో గూడుకట్టుకుని ఉన్న గుడ్డి నమ్మకాలను పారద్రోలి సక్రమ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత వికాసంతోపాటు సామాజిక ప్రగతి కూడా సాధ్యమవుతుంది. ఒక శతాబ్దం క్రితం లైంగిక విజ్ఞానం అంతగా అవసరం ఉండేది కాదు. అప్పట్లో కేవలం 14, 15 ఏళ్లకే ఆడపిల్లలకు వివాహాలు జరిగేవి. అప్పటి ఆచారాలు, వ్యవహారాలు కారణంగా దంపతులు వారాలు, నెలలపాటు ఒకరికొకరు తాకే అవకాశం కలిగేది కాదు.


చాలాకాలం తర్వాతనే ఇరువురి నడుమా దాంపత్య బంధం ఏర్పడేది. నాటి-నేటి సమాజాలలో చాలా వ్యత్యాసాలున్నాయి. ప్రస్తుత వివాహ వయస్సు 25 నుంచి 35 ఏండ్లకు పెరగడంతో ఆడవారిలోనూ, మగవారిలోనూ సెక్స్ భావాలు పెళ్లికి ముందే మేల్కొంటున్నాయి. ఫలితంగా అవాంఛిత గర్భదారణ, లైంగిక పరిణామాలు, ఎయిడ్స్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేటి యువతీయువకులకు లైంగిక విద్యాబోధన ఎంతైనా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: