కొందరికి కోర్కెలు విపరీతంగా పెరుగుతున్నా కూడా.. అందులో పార్టిసిపేట్ చేయాలని అనిపించదు. ఇలా ఆలోచనలు రావడానికి పలు కారణాలు వుంటాయి. అవేమిటంటే.. అలసిపోవడం, శక్తి సన్నగిల్లడం, ఆసక్తి లేకపోవడం వంటివాటితోపాటు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకపోవడం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. తినే పదార్థాలకు సెక్స్ సామర్థ్యానికి లింకు ఉంది.

విటమిన్లతో కూడిన సమతుల ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి శక్తేకాదు.. సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఈ విటమిన్లు సెక్స్ సమయంలో రతిని అత్యంత సమర్థవంతంగా చేసేందుకు ఇంధనంలా పనిచేస్తాయి.

మరి వీటికోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన చిట్కాలు....!


ఈ విటమిన్ తో కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలోని నాళాలు చురుకుగా ఉంటాయి. స్త్రీల విషయంలో అయితే యోని, యోని ద్వారంలో ఉండే నాళాలు చురుకుగా ఉండటం వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు తృప్తి ఇస్తుంది. కేరెట్, వెన్న, గుడ్డులోని పచ్చసొనను తీసుకుంటే ఈ విటమిన్ పొందవచ్చు.

ఈ విటమిన్ లోపం వల్ల సంతానలేమి సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఫోలిక్ ఆసిడ్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల సంతాన సమస్య ఎదురుకాదు. కోడిమాంసం, చేపలు, బీన్స్, గోధుమపిండితో చేసే పదార్థాలు, గింజ ధాన్యాలు, అరటి, ఆకుపచ్చని కూరల్లో ఈ విటమిన్ ఉంటుంది.

విటమిన్ సి కూడా సంతానప్రాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో వీర్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈ విటమిన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే వీర్యకణాలు బలంగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, స్ట్రాబెర్రీలు, కివి పండ్లలో విటమిన్ సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: