ఈ మద్య కాలంలో యువతకు తమ లైంగిక సామర్ధ్యంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. మగవాళ్ళు సెక్స్ కోర్కెలు తగ్గడానికి డిప్రెషన్, డిప్రెషన్ కు వాడే మందులు, అలాగే అధికరక్తపోటు, అధికరక్తపోటుకు వాడే మందులు మాత్రమే కాక అనేక శారీరక, మానసిక, జీవరసాయన కారణాలుంటాయి. ఇలాంటివి కలిగినప్పుడు దేనివలన భర్తకు సమస్య కలిగిందో గుర్తించడం, చికిత్సకు మార్గాలన్వేషించడం చికిత్సాకాలంలో సహకరించడం భార్యకు అత్యంత అవసరం.

కొన్ని రకాలైన విధానాలు సహజమైనవే అయినప్పటికీ వాటిని అసహజమైనవిగా భార్యలు భావిస్తుంటారు.పెళ్ళయిన కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మగవాడి సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
భర్తతో అనుబంధం పెరిగేకొద్దీ భార్య ఇన్హిబిషన్స్ అన్నీ వదులుకొని శృంగారంలో ఉత్సాహంగానూ, చురుగ్గానూ పాల్గొనగలుగుతుంది. మగవాడి విషయంలో రోజువారీ ఆందోళనలు, పనివత్తిడి, ఆర్ధిక ఇబ్బందులు సెక్స్ ను తగ్గిస్తాయి. కొందరు ఇంటికి వచ్చాక కూడా వృత్తికి సంబంధించినవే ఆలోచిస్తూ కూర్చుంటారు. అలాంటప్పుడు భార్య సహకారం మరింత అవసరమవుతుంది.

మరి లైంగిక సామర్ధ్యం పెంచుకునే మార్గాలు..! వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు.. తగినంత వ్యాయామం ఉండాలని చెపుతున్నారు.అన్నిటికంటే ముఖ్యంగా.. మనస్సు ఉత్సాహంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పులు కండరాలను పటిష్టం చేస్తాయని అంటున్నారు.


వీటితో పాటు ఆకుకూరలు, కాయగూరలు తగు మోతాదులో తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఇంకా పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే సెక్స్‌ శక్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. కోడి మాంసం, చిక్కుళ్ళు, బఠాణీలు, డ్రై ఫ్రూట్స్‌ వంటివి మంచి బలవర్ధక ఆహారమని చెపుతున్నారు. ఈ ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేస్తూ మానసికంగా ఉత్సాహంగా ఉంటే లైంగిక జీవితం కూడా పూర్తిస్థాయిలో సంతృప్తికరంగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: