పింపుల్స్ రావడానికి స్త్రీ-పురుష సెక్సు హార్మోన్స్ కు సంబంధించిన హెచ్చుతగ్గులు కలగడమే కారణంగా భావించబడుతోంది. మగవారిలో పింపుల్స్ ముఖంపై యుక్తవయస్సు రాగానే ఎక్కువ మోతాదులో తయారయ్యే పురుష సెక్సు హార్మోను టెస్టోస్టిరాన్ కారణమని భావించబడుతోంది. అలాగే స్త్రీలలో సెక్స్ హార్మోను ప్రోజస్టిరాన్ ఎక్కువ అవడం కారణంగా భావించబడుతోంది. మొటిమలు రావడం విషయంలో స్త్రేలకి ఎక్కువగా వస్తాయా, పురుషులకి ఎక్కువ వస్తాయా అని పరిశీలించి చూస్తే పురుషుల్లోనే మొటిమలు దట్టంగా, ఎక్కువగా, పెద్దవిగా వస్తాయని తేలింది. మొటిమలు కేవలం ముఖంమీదనే వస్తాయని చాలామంది భావిస్తారు. కాని మెడమీద, ఛాతీమీద కూడా వస్తాయి.


కొందరిలో శరీరం మొత్తంమీద ఎక్కడయినా రావచ్చు. సెక్స్ భావాల సంఘర్షణ మొటిమలకి కారణమా? : మొటిమలు రావడానికి స్త్రీలలోగాని, పురుషులలోగాని ఎక్కువ మోతాదులో తయారయిన సెక్సుహార్మోన్లు కారణమయినప్పటికీ, కొన్ని ఇతర కారణాలు కూడా మొటిమలు రావడానికి దోహదకారులవుతాయి. వంశంలో మొటిమలు ఎక్కువగా వచ్చే స్వభావం ఆహారం సరిగా లేకపోవడం, కొన్ని మందులు, కాస్మటిక్స్, శుభ్రత సరిగ్గా లేకపోవడం మొటిమలు రావడానికి కొన్ని కారణాలు. యువతీ యువకుల్లో యవ్వనం తొంగిచూస్తే తోలిదినాల్లోనే మొటిమలు ముఖంమీద కనబడతాయి.


సాధారణంగా పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో మొటిమలు ప్రారంభమై వీలయినంత వరకు ముఖాన్ని ఎంత పాడుచేయాలో అంతా చేసి 18-20 సంవత్సరాల వయస్సులో ఇక వాటి ప్రభావాన్ని తగ్గించుకుంటాయి. మామూలుగా ఆడపిల్లల్లో రజస్వల అవడం, మొటిమలు ముఖంమీద రావడం దాదాపు ఒకేసారి జరుగుతూ వుంటాయి. చాలామందిలో 20 సంవత్సరాల వయస్సు తరువాత మొటిమలు తగ్గిపోవడం ప్రారంభించినా కొందరికి ఇంకా చాలాకాలం వరకు వుంటాయి. మరికొందరిలో జీవితాంతం వుంటూ వుంటాయి.  


వివాహ విషయమై సెక్సు విషయమై తల్లితండ్రుల భావాలకు, యుక్తవయస్సు వచ్చిన పిల్లలభావాలకు మధ్య జరిగే జరిగే మానసిక సంఘర్షణ మొటిమలు రావడం విషయంలో ముఖ్యకారణమని వైద్యశాస్త్రం చెబుతోంది. కొన్ని మానసిక కారణాలవాళ్ళ సెక్స్ జీవితంలో సరైన తృప్తి పొందలేని వాళ్ళు, సరిపెట్టుకోని వాళ్ళు మొటిమలు ఎక్కువగా వచ్చి బాధపెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆవేశం ఎక్కువగా ఉండటం, వివేచనా శక్తి తక్కువగా వుండటం, శారీరకంగా తగిన శక్తి లేకపోవడం, అనవసరంగా ఆందోళన చెందడం మొటిమలు రావడానికి కారణం అవుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: