మనిషి ఎంత విజ్ఞానంతో ముందుకు సాగుతున్నా..శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించినా ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా భయపడుతారు అదే భగవంతుడు. మనిషి సృష్టికి మూల కారణం భగవంతుడు అని నమ్ముతారు కాబట్టి దేవుడంటే అంత భయం. కొంత మంది నాస్తికులు కూడా ఉన్నారు...అసలు దేవుడే లేడు అని గుడిలో మొక్కేది బండరాయి అని అంటారు. ఏది ఏమైనా మనిషి విశ్వాసం పై ఆధారపడి ఉంటుంది. అయితే మన దేశంలో ఆలయాలు దర్శంచే వారు కొన్ని నియమనిబంధనలు పాటిస్తూ ఉంటారు...పాటించాలి కూడా.. మరి ఆ నియమాలు ఏమిటో ఒక్కసారి చూద్దామా..! 


ఆలయం వద్ద భక్తులు


గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు. గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి.  కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తోట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారనిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు. దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి. దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపూ చేయాలి. అమ్మవారిని నూనె దీపమయితే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: