భారత దేశం గొప్ప ఆద్యాత్మికత దేశం..ఇక్కడ దేవుంటే పరమ భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. అంతే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో రక రకాల దేవుళ్లు, దేవతలు ఉన్నారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వారిని కొలుస్తారు. దేవుళ్లకు మనం ముఖ్యంగా పత్రం, పుష్పం,ఫలం,తోయం సమర్పించుకుంటారు. ఇందులో పుష్పాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు..ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..?  భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు ‘గీత’లో చెప్పాడు. 


శ్లో!! మధ్యమానామికా మధ్యే పుష్పం సగృహ్య పూజాయేత్!
 అంగుష్ట తర్జన గ్రాభ్యాం నిర్మాల్యమపనోదయేత్!! 


 పువ్వులను మధ్యవేలికి, ఉంగరపు వేలికీ మధ్యలోకి తీసుకొని పూజ చేయాలి. అంతకు ముందురోజు ఉపయోగించి పూజ చేసిన పువ్వులను (నిర్మాల్యం) బొటనవేలు, చూపుడు వేళ్ళతో తీసివేయాలి. 
వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు  చెబుతున్నాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు.

పుష్పాలతో పూజ



అలాగే కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట. జుట్టు ముడిలో తులసిదళాన్ని ధరించరాదట. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట. విష్ణుభగవానుడిని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలిట. అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: