పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు. అంటే.. ఆదివారం సూర్యభగవానుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రమణ్యస్వామి, ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం. ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది. వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో.. ఆ రోజు ఆ దేవుడికి పూజలు, దర్శనాలు చేసుకుంటారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం తిరుమలేశుడు. ప్రతీ భక్తుడు ఈ స్వామిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు.


ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం ? ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా ? మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణాకటాక్షాలు పొందలేమా ? స్వయంభూ క్షేత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామీ వారిని వరుసగా " 7 " శనివారములు దర్శించినచొ భక్తుల కోర్కెలు తప్పక నెరవేరును. ప్రారంభించే మొదటి సనివారం ధ్వజస్థంభం వద్ద నిలబడి మీ మనస్సులోని కోరికను స్వామీ వారికి నివేదించుకొని " 7 " సార్లు ప్రదక్షిణము చేసి స్వామీ వారిని దర్శించు కోవలెను .స్త్రీల విషయంలో ఏదైనా ఒక శనివారం అవాంతరం కలిగినచో మరొక శనివారం అదనంగా చేసినచో " 7 " సనివారముల ఫలితము కలుగును. " 7 " శనివారములు దర్శనాలు పూర్తి అయిన పిదప స్వామీ వారి ఆలయంలో అన్నదానమునకు బియ్యం,పప్పులు,నూనెలు,ఏదైనా గాని భక్తుని స్తోమతను బట్టి 7 కుంచాలు లేదా 7 కేజీలు లేదా 7 గుప్పెళ్ళు గాని సమర్పించు కొనవచ్చును.


తిరుపతి వెంకటేశ్వర స్వామివారు


సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు. వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం, శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం కావడం, ఆలయం నిర్మాణం చేయమని శ్ర్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: