తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం.. తిరుమల వేంకటేశ్వర స్వామి. ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివీతీరని ఆనందం కలిగించే దైవం. శేషాచల కొండల్లోని ఏడు కొండలపై కొలువున్న దైవం వేంకటేశ్వరుడు. అందుకే ఆయనకు ఏడుకొండలవాడుగా పేరు. 

ఏడుకొండలవాడా.. వేంకటేశ్వరా..అనాథరక్షకా అని ఆర్తితో పిలిస్తే ఎంతటి కష్టాన్నైనా ఆయన మాయం చేస్తాడన్నది భక్తుల విశ్వాసం. మరి శ్రీ వేంకటేశ్వరుడు ఏడు కొండలపైనే ఎందుకు కొలువయ్యాడు. తనకు ఇష్టమైన భక్తుల నుంచి ఎందుకు అంత దూరంగా నివశిస్తున్నాడు. భక్తులకు అందుబాటులో ఉండటం ద్వారా ఎక్కువ మందికి దర్శన భాగ్యం కల్గించవచ్చు కదా.. అన్న అనుమానం కొందరికి కలగడం సహజం. 

కానీ తిరుమలేశుడు ఏడు కొండలపై ఉండటం కూడా భక్తుల సంక్షేమం కోసమే అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. కష్టించకుండా ఈ ప్రపంచంలో ఏదీ రాదు. కష్టంచకుండా వచ్చిందేనీ నిలవదు. సంతృప్తినీయదు.. ఈ నిత్య సత్యాన్ని భక్తులకు తెలపడం శ్రీవారి ఉద్దేశ్యం. 

అంతేకాదు.. మనిషిని నిరంతం ప్రలోభపెట్టే మానసిక ప్రవృత్తులను భక్తుల నుంచి దూరం చేసేందుకు కూడా స్వామి ఏడు కొండలపై ఉంటున్నాడు. అదెలాగంటారా.. ఏడు కొండల్లో ఆరు కొండలు స్వామి దృష్టిలో అరిషడ్వర్గాలు.కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.. సామాన్యులను నిత్యం ఇబ్బంది పెట్టే లక్షణాలు. 

వీటిని అధిగమిస్తే పరమానందం మానవుని సొంతం. అందుకే ఏడుకొండల్లోని ఒక్కో  కొండను దాటడం అంటే ఒక్కే అరిషడ్వర్గాన్న జయించడం అన్నమాట. తిరుమలేశుని మనసారా తలచుకుని గోవింద నామం జపిస్తూ.. స్వచ్ఛమైన ఆత్మతో ఒక్కో కొండా దాటుకుంటూ వెళ్లిన తర్వాత స్వామిని దర్శిస్తే.. అంతులేని ఆనందం లభిస్తుంది. అదీ ఏడుకొండలపై స్వామి కొలువుండటంలోని ఒక రహస్యం. 



మరింత సమాచారం తెలుసుకోండి: