ఈ అనంత విశ్వంలో మనిషిని బతికించేది ఏది.. గాలి, నీరు, ఆహారం.. ఇవేవీ కావు.. ఇవి నిజాలే అయినా వీటిని మించి మనిషికి బతకాలన్న ఆలోచనకు ప్రేరేపించేది ఆశ.. అవును ఈ రెండక్షరాల పదమే మనిషిని నడిపిస్తుంది. అందుకే మనిషి ఆశాజీవి అంటారు. ఈ ఆశే లేకపోతే మనిషి మనుగడ అనాగరిక జీవిగానే మిగిలిపోయేదంటే అతిశయోక్తి కాదు. 

అయితే ఇక్కడో ప్రధానమైన విషయం ఉంది. ఆశ, అత్యాశ మధ్య తేడా తెలుసుకోకపోతే జీవితం దుర్భరమే అవుతుంది. బాగా చదువు కోవాలి, మంచి జీవనం గడపాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి..ఇలాంటివన్నీ ఆశలే.. ఇలాంటి ఆశే మనిషిని పురోగతి వైపు నడిపిస్తుంది. అయితే అత్యాశ మాత్రం మనిషిలోని మనిషి తనాన్ని మాయం చేస్తుంది. 

స్వచ్ఛమైన ఆశ మనిషికి మేలు చేస్తే.. ఈ అత్యాశ మనిషిని అధోపాతాళానికి తొక్కేస్తుంది. అత్యాశ మనిషి విచక్షణను అంతం చేస్తుంది. అత్యాశ కారణంగా.. అంతా నాకే కావాలి. అన్నీ నాకే కావాలి.. ఇలాంటి నా నాకు.. అనే స్వార్థం అంతులేనంతగా పెరిగిపోతుంది. అయితే ఈ ఆశ , అత్యాశ మధ్య ఉన్న సన్నిని పొర లాంటి తేడా తెలుసుకోలేకపోతే
జీవితం నరకప్రాయమే. 

ఈ ఆశ- నిరాశల మధ్య తేడాను ఓ చిన్న ఉదాహరణతో చక్కగా వివరించొచ్చు. అత్యాశ ఇనుప ముక్క లాంటిదైతే.. ఆశ అయస్కాంతం లాంటింది. ఇనుము కాలం గడిచిన కొద్దీ తుప్పు పట్టి ఎందుకూ పనికిరాకపోతుంది. కానీ అదే అత్యాశ ఆశగా మారితే.. ఇనుము అయస్కాంతంగా మారినట్టే. అది ఆ ఇనుముకు ఆకర్షణ తెస్తుంది. శక్తి పుట్టిస్తుంది. ఈ తేడా తెలుసుకున్న మనిషి జీవితాన్ని ఆకర్షణీయంగా మలచుకుంటాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: