కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెట్టి మొదటి రోజు 10 ఎద్దుల బండ్లు నిండేలా కట్టెలు సిద్ధం చేసి యజమానికి లెక్క చెప్తాడు. మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి అతని పనిని ప్రశంసిస్తాడు. అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు. సాయంత్రం యజమానికి లెక్క చెప్తాడు.

అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు. రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పడిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరుగుతున్న విషయం మొత్తం షేర్ చేసుకుంటాడు. 'అయ్యా నేను రోజు మొత్తం క్షణం అయినా సేద తీరకుండా ప్రయత్నించినా మొదటి రోజు చేసినంత పనిని చేరుకోలేక పోతున్నాను..అని తన బాధను పంచుకుంటాడు.

అంతా విన్న యజమాని..'చూడు బాబు.. నీ ప్రయత్న లోపం ఏమి లేదు. నేను నిన్ను నమ్ముతాను. నీలో చేయాలన్న తపన ఉంది. చేయగలిగిన శక్తి ఉంది. కాని... నీవు చేస్తున్న తప్పేంటో నీకు తెలియట్లేదు' అని సమాధానం ఇస్తాడు. నేనేమి తప్పు చేసానని పని వాడు అడుగుతాడు.

అందుకు యజమాని... ఎప్పుడయినా నీవు కట్టెలు కొట్టే నీ గొడ్డలిని పదును పెట్టావా..?? అని అడుగుతాడు. అందుకు పని వాడు లేదనే సమాధానం చెప్తాడు.. యజమాని చిన్నగా నవ్వి... 'బాబు కట్టెలు కొట్టడం నీకు వచ్చిన కళ. అందులో నీవు నిపుణుడవు. గొడ్డలితో పని చేసే నీ నైపుణ్యానికి పదును పెడితే. నిన్ను మించిన పని వాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు...'

తను చేస్తున్న తప్పును సరి దిద్దుకున్న పని వాడు.. తన గొడ్డలికి మరుసటి రోజు పదును పెట్టి ప్రయత్నించాడు. తిరిగి తన పూర్వ స్థితిని చేరుకోవడమే కాదు... ఇంకా మెరుగయిన పనిని చేరుకున్నాడు.
 
'మనలో చాలా మందికి కూడా అంతులేని నైపుణ్యం, చేయాలన్న తపన ఉంటుంది.. కాని వారి నైపుణ్యానికి మెరుగు పెట్టడం మరచి పోతుంటారు. అందుకు నిదర్శనమే ఈ చిన్న కధ...టాలెంట్ ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వాడే నిజ జీవితంలో సక్సెస్‌ఫుల్‌ పెర్‌ఫార్మర్‌ అవుతాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: