శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో అంటారు "మళ్లీ అందరూ రాసిన రామాయణమే నేను రాయటం ఎందుకు? అంటే ప్రతి పూటా తిన్న అన్నమే మళ్లీ ఎందుకు తింటున్నావు? అంటే అన్నం తినకపోతే ఉండలేము కనుక తింటున్నాము. అలాగే వినిన రామాయణమే మరల మరల వింటున్నాము. 

రామాయణం లేని నాడు మనిషి జీవితమే లేదు. జీవితాన్ని జీవితంగా, మనిషిని మనిషిగా నిలబెట్టగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీరామావతారము నరులకు ఆదర్శప్రాయమైనది. కేవలం రాక్షససంహారం కోసమే అయితే రావణవధ అవగానే అవతార పరిసమాప్తి జరగాలి. కానీ ఒక మనుష్యుడు మనుష్యుడిగా ఎలా బతకాలో లోకానికి నిలువుటద్దంగా నిలిచాడు.

శ్రీరాముడు.. ఆదర్శపురుషుడు.. మన బెంచ్ మార్క్ 


శ్రీరాముడు నరుడిగా జన్మించి, నరుడిగా ప్రవర్తించి, నరులకు ఆదర్శప్రాయుడు అయ్యాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు మనకు నేర్పుతాడు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు.

శ్రీరామ కథ మధురాతి మధురం. ఎన్ని సమస్యలు ఎదురైనా ధర్మము వీడని రాముడు యుగాంతరాలకు కూడా మార్గదర్శకుడు అయ్యాడు. శ్రీ రామాయణ పఠనం మనుష్యుడిలోని రాక్షసత్వాన్ని పోగొట్టి దైవత్వాన్ని నిలుపుతుంది. శ్రీమద్రామాయణం ప్రతి ఒక్కరూ చదవవల్సిన గ్రంథము. అందుకే రోజూ ఓ పేజీ అయినా సరే రామాయణం చదవండి. మీలో మార్పు మీరే చూస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: