ఏదీ కలసిరావడం లేదు.. ఏం చేసినా విజయం దక్కడం లేదు.. అని బాధపడేవారు కాస్త ఓపికతో వ్యవహిస్తే.. అన్నీ సర్దుకుపోతాయి. దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. 
మిమ్మల్ని గెలుపు వాకిట నిలిపే 10 శక్తివంతమైన సూత్రాలివి. ఆచరించి చూడండి..

1.  సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

2.ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని    ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

3.తాళం తో పాటే తాళం చెవికూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా  సమస్య కూడా  రాదు.

4. తూటా కంటే శక్తివంతమైనది మాట!  ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు.

5.మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే, అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు.

6. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

 7. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమష్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని.

 8. స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను,భార్యను పేదరికంలోను, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.
 
9. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు.

 10. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: