ఆశలు అందరికీ ఉంటాయి.. కొందరే వాటిని సాధిస్తారు.. భగవంతుడు అవయవాలు, మేధస్సు అందరికీ దాదాపుగా అన్నీ సమానంగానే ఇస్తాడు. కానీ దాన్ని ఉపయోగించడంలో తేడాతోనే కొందరు మాత్రమే విజేతలవుతారు. చాలామంది పరాజితులుగా మిగిలిపోతారు. మరి విజయం నుంచి ఒకరిని దూరం చేసేది ఏంటి..?

అది తెలుసుకోవాలంటే మిమ్మల్ని విజయానికి దగ్గర చేసేదేంటో తెలుసుకుందాం.. విజయం అందుకునేందుకు స్ఫూర్తినిచ్చే నాలుగు మంచి మాటలు స్మరించుకుందాం..   

ఓటమి లేనివాడికి అనుభవం రాదు,
 అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. 
గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,
 ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు.
 
ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.
 ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు
ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,
గెలుస్తావు.

ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, 
గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు.
అదే తేడా…

గెలవాలన్న తపన,
గెలవగలను అన్న నమ్మకం,
నిరంతర సాధన.

ఈ మూడే నిన్ను గెలుపుకు
దగ్గర చేసే సాధనాలు.

నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ
ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.
స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ,
అహంకారం ఉండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: