మనం మరణించగానే మన ప్రకృతి మనల్ని కోమాలొకి తీసుకువెడుతుంది. మనం చేసిన పాప పుణ్యాల నిష్పత్తిని బట్టి ఆయా లోకాలలో జన్మిస్తాము. జన్మకి౼కోమాకి మధ్యలో ఒక సంఘటన జరుగుతుంది. అది ఏమిటంటే కోమా నుండి బయటపడిన ఆత్మ ఇంకా తను బ్రతికే ఉన్నాను అనుకుంటుంది. చుట్టూ ఉన్న వారి రోదన చూచి తను చనిపోయాను అని భావిస్తుంది. అందరిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాని మధ్యమ ఆధారం లేక అది సాధ్యపడదు. 

తన దేహం మీద మమకారం పోతుంది. నలబై తొమ్మిది రోజులు ఆత్మ అక్కడే ఉంటుంది. ఆత్మకి కొన్ని భయంకర అనుభూతులు కలుగుతాయి. కొన్ని శక్తులు మనల్ని వెంటాడి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. వాళ్ళు చాలా భయంకరంగా , విచిత్రాయుధాలతో వుంటారు. వాళ్ళు మనలోని కోరికలు మాత్రమే. భగవంతుని అనుగ్రహం వుంటే వాటి నుండి తప్పించుకోవచ్చు. 

మొదట్లో ఏమి అర్ధం కాదు. తరువాత అంతా అర్ధం అవుతుంది. మళ్లీ తన కుటుంబంలో జన్మించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మరణం తరవాత ఆ కుటుంబంలో జననం జరుగుతుంది. అవకాశం లేకపోతే పెంపుడు జంతువుల రూపంలో ఆ కుటుంబంలోకి చేరుతుంది. అది కుదరకపోతే వేరే దేహం కోసం వెదుకుతుంది. ప్రపంచాన్ని నిగూఢంగా చూస్తుంది. అంతా అర్ధం చేసుకుంటుంది.

అదే సమయంలో సృష్టి, లయ కారకుడు దారి చూపిస్తాడు. ఆత్మా పాప పుణ్యాలను బట్టి దేహాన్ని ఏర్పాటుచేస్తాడు. రాగ బంధాలు, కోరికలు లేని ఆధ్యాత్మక భావన ఉన్న ఆత్మలు దేవుని చెంతకు చేరుతాయి. అదే ధ్యానం చేసినవాళ్ళకి మరణం తరవాత వాళ్ళు కోమాలోకి వెళ్ళరు. మేలుకువగానే వుండి తమకు ఎక్కడ జన్మించాలి అనుకుంటే అక్కడ జన్మిస్తారు. 



కాని మరణం తరవాత, సమయాలలో తేడా వుంటుంది. అంటే మరణించిన తరవాత జన్మించేవరకు భూమి మీద కాలము ఒక నెల అనుకోండి అక్కడ ఒక రోజుతో సమానం. రుద్రాక్ష ధరించినా, విభూది ధరించినా మధ్యమ పాపాలు నశించి పుణ్యలోకాలకు వెడతారు. అందుకే మరణించిన వారికి విభూది పూస్తారు. అందువలనే శివుడి విభూదిని భక్తులకు అందించేవారు. 

అధికపాపాలు చేసేవారికి ప్రాణము అపానరంద్రము నుండి పోతుంది. మధ్యమ పాపాలు చేసేవారికి ముక్కు , చెవి నుండి పోతుంది. అల్పపాపాలు చేసేవారికి కంటి నుండి, నోటినుండి పోతుంది. భగవన్నామ స్మరణతో, దైవ చింతనతో, పరులకు మేలు చేసి, అనుష్టానంలో వుండే వారి ప్రాణము బ్రహ్మ రంద్రము నుండి పోతుంది. భగవంతుడు మనకు ఏది చేసినా అదే న్యాయం. ఆయన ఇచ్చిందే మనకు భిక్ష. అన్నభావనతో గడపాలి. అహం భావము , కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష వుండరాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: