జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" ఈ లోకంలో 4 రూపాలతో ఉంటుంది. వారు:-
1. జనక మాత - మనకు జన్మ ఇచ్చిన అమ్మ (కన్న తల్లి)
2. గో మాత - గోవు (ఆవు)
3. భూ మాత - భూదేవి (భూమి)
4. శ్రీ మాత - దేవాలయాలలోని అమ్మవారు (సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గా దేవి, కాళికా దేవి, చౌడేశ్వరి దేవి, etc మరియు గ్రామ దేవతలు - గంగమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, అంజేరమ్మ, ఆరేటమ్మ, చెంగాళమ్మ, etc) మనకు కష్టాలు, బాధలు వచ్చినపుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనలను కాపాడుతుంది.
గో మాత:-
జగన్మాత "శ్రీ ఆది పరా శక్తి" అయిన "శ్రీ లలితాంబికా దేవి" యొక్క 1000 నామాలలో (శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం లో) "గోమాతా" అనే పేరు ఒకటి. అంటే "గో మాత" సాక్షాత్తూ పరదేవత యే (శ్రీ ఆదిపరాశక్తి యే). కనుక గోమాత "శ్రీ లలితాంబికా దేవి" యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు
1. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తూ పరదేవతకు మరియు 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే.
2. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తూ పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే.
3. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు పూజ చేసినట్లే.
4. గర్బగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి, మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తూ పరదేవతకు అలంకరణ చేసినట్లే.
5. గోవులు, దూడలు నేల మీద నడిచి వెళుతుంటే, వాటి వెనుకన మనం నడిచినపుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి, దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపై ఉంది.
6. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలోని పాపాలుj నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లపుడూ శుభమే జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: