ఏడుకొండలవాడు.. ఎందరో తెలుగువారి ఇలవేల్పు.. ఒక్క తెలుగువారేంటి.. యావత్ దేశమంతటా ఆయన భక్తకోటి ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం ఉన్న దేవాలయాల్లో తిరుమల ఒకటి. మరి ఆ ఏడు కొండలవాడిని దర్శించుకునేందుకు రోజూ సగటున 70 నుంచి 80 వేల మంది భక్తులు వస్తుంటారు. 

ఐతే.. తిరుమల శ్రీవారిని దర్శించుకునే సమయంలో కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి. అవి తెలుసుకోవడం భక్తులకు అన్నివిధాలా శ్రేయస్కరం. అవేమిటంటే.. తిరుమలకు కేవలం శ్రీవారిని దర్శించుకుందామనే తలపుతోనే రావాలి. వేరే పనులపైనో.. ఇతర ఉద్దేశాలతోనే తిరుమలకు రాకూడదు.



తిరుమల నాలుగు మాడ వీధుల్లో చెప్పులు అస్సలు ధరించకూడదు. తిరుమలలో స్త్రీలు పువ్వులు ధరించ కూడదు. ఎందుకంటే తిరుమల సప్తగిరుల్లోని పూలన్నీ శ్రీవారి సేవకే వినియోగించాలి. తిరుమల యాత్రలో ఉన్నప్పుడు మనస్సును శ్రీవారిపైనే ఉంచాలి. ఇతర విషయాలపై మనస్సు లగ్నం చేయకూడదు. 

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం త్వరపడకూడదు. మీ వంతు వచ్చే వరకూ ఓపికగా నిరీక్షించాలి. తోసుకోవడం, నిబంధనలను అతిక్రమించడం చేయకూడదు. అలాగే తిరుమలలో అన్నప్రసాదాలను వృథా చేయకూడదు. తిరుమల యాత్రలో విలువైన ఆభరణాలు ధరించి రాకూడదు. కొన్ని రోజుల్లో ఆచార వ్యవహారాల కోసం ఆలయాలను మూసివేస్తారు. వచ్చేటప్పుడు ఆ విషయం సరి చూసుకుని రావడం మంచిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: