వరక్ష్మీ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైన వాటిలో ముఖ్యంగా ద్రవాలైతే గో క్షీరము అంటే ఆవుపాలు..నెయ్యి ఇక నైవేద్యాల్లో పయసా పట్టం అన్నం పయసం పాలతో ఉడికించిన అన్నం..అస్సలు నీళ్లు పోయకుండా చేసింది అయితే చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన ఫలం నారీ కేలం అంటే కొబ్బరికాయ. అమ్మవారికి ఇష్టమైన ఫలాల్లో మరొకటి కదలీ ఫలం అంటే అరటి పండు. ఇక నారీకేలం ముదిరినా బాగుంటుంది..కదలీ ఫలం ముదిరితే పాడైపోతుంది అంటే విత్తనంగా వాడే ఫలం..విత్తనంగా వాడకుండా కదలీ ఫలం అంటే ఇష్టం. అమ్మవారికి ఇష్టమైన పత్రం బిల్వహా అంటే మారేడు పత్రం అంటే చాలా ఇష్టం. ఇక అమ్మవారికి ఇష్టమైన జంతువు ఎనుగు.

అయితే అమ్మవారిని పూజించే మహిళలు అమ్మవారికి ఇష్టమైన రీతిలో అలంకరణ అయితే అంటే చక్కని పుష్టాలు పెట్టుకోవాలి..కాళ్లకు పసుపు రాసుకోవాలి,కళ్లకు కాటుక పెట్టుకోవాలి, చేతులకు నిండైన గాజులు వేసుకొని ఉండాలి..ఇక వివాహం అయితే మాంగళ్యసూత్రం ధరించి ఉండాలి.  నుదుట కుంకుమ పెట్టుకొని ఉండాలి...ముత్తైదువ అని ఎవరినైతే అంటారో అలా కాళ్లకు మెట్టెలు పెట్టుకొని భర్త ఈ మద్య ఏదైనా హారాన్ని చేయిస్తే..ఆ హారాన్ని అమ్మవారికి సమర్పించి ఆ సమర్పించిన హారాన్ని తను వేసుకున్నట్లైతే అదో చక్కని అలంకారం.

ఇక భర్త కొని ఇచ్చిన హారం ఆ అలంకారానికే అద్భుత రూపం.  మహిళలు నిండుతనంతో పూర్తి అలంకరణతో లక్ష్మీ దేవిలా ఉంటూ..వరలక్ష్మిని పూజించాలి.  వరలక్ష్మీ పూజ చేసేటపుడు సమర్పించాల్సిన నైవేద్యం పాయసం, పెరుగుతో చేసి దద్దోజనం, పులిహార మంచి తీపి పదర్దాలు అయితే అమ్మావారికి మాత్రం ఆవునెయ్యితో చేసిన పాయసమే చాలా ఇష్టం. 


మరింత సమాచారం తెలుసుకోండి: