దైవాన్ని పూజించే భక్తులు కొన్ని సందర్భాల్లో ఆ భగవానుణ్ణి నిందిస్తారు. ఆ నిందించిన తీరు కొన్ని సార్లు హాస్యాస్పదంగాను, మరికొన్నిసార్లు అంతరార్ధంతోనూ, శ్లేష ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దైవాన్ని నిందించినా పరమాత్ముడు దానిని కూడా భక్తిగా స్వీకరిస్తాడు.  ఆ  నిందా పూర్వక భక్తికి ఒక సందర్బం శివుడు - మరో సందర్బం విష్ణువు కు సంబందించిన భక్తుల శ్లేషపూర్వక నిందారోపణలు వివరిస్తాను.


 

ధత్తేముర్ధని శుభామయూఖ సఖల శ్లాఘయే కపాల స్లాజం

వక్షస్యాద్రి సుతా కుచాగరు రాజస్సాంద్రే చితాభస్మచ

తద్భావనాది కవిప్రణీత లలిత స్తోత్ర ప్రభంధ ప్రియే

త్వత్కర్ణేలభతామయం మమ గిరాం కుంభోపి సంభావానాం

 

ఓ మహా శివా! అమృతం లాంటి తెలతెల్లని వెన్నెల వెలుగులను వెదజల్లే కురిపించే శశిరేఖను నీ శిరస్సు పై ధరించావు. దాని ప్రక్కనే నీ శిఖ చుట్టూ చుట్టిన అమంగళమైన కపాలాల హారం  ఎంత అవమానకరం. ఒక ప్రక్క అమృతం - మరోప్రక్క అమంగళం ఏమి జీవితమయ్యా నీది? ఆ మహాదేవి ఆమె హిమోన్నత వక్ష ద్వయ సంపదపై సంపూర్ణ కుంకుమాది లేపనాలతో అద్భుత అలంకరణాలతో నీ దేహ సగభాగాన్ని పంచుకొనగా, తమరేమో ఈ అద్భుత మరపురాని సందర్భాన్ని నిర్లక్ష్యం చేస్తూ, నీ విశాల వక్షాన్ని శవదహనం నుండి సేకరించిన చితాభస్మం పులుముకొని ఉన్నావు. నీవుచేసేదంతా అతి హీనమైన పని, ఇలాంటి పనులు అలాగే చేస్తూవుడటం తమరికి అలవాటేకదా!


సస్యారొపణ రక్షనాక్షమతయా భిక్షతనం నిర్మితం

కచ్చాగ్రంధన మొచనాలసతయా వాసొ దిశః  కలిప్తాహ

సానాన్వెషన ఘర్షనావసతయా భస్మాంగరాగః

విశ్వోత్పాధన రక్షణాపహరణా యాసస్వతాయ నేక్షితః



ఓ పరమాత్మా! నీవు సోమరివై ఇంటిటికి తిరిగి బిక్షమెత్తుకొని జీవనం సాగించేబదులు, కష్టించి వ్యవసాయం చేసుకొని పంట దాన్యాలను పండించుకొని గౌరవంగా జీవించటం సాధ్యమైనా సోమరివై బిక్షమెత్తుకొనే అలవాటుమానవుకదా! అందంగా, శుభ్రంగా మడచిన మడత నలగని వస్త్రాలను ధరించాలంటే నీవు కొంచం కష్టపడాలి. కాని శుభ్రత పాటించే అలవాటులేని నీవు దిగంబరుడవై (నగ్నంగా)జీవిక సాగించటం తగునా! చందనాది దేహ లేపనాలను తయారుచేసుకుని దేహాలంకరణ పై శ్రద్ధ, ఇష్టం నీకులేనేలేవు. ఆ శ్రమ తీసుకునే ఆలోచనే లేదు. ఇంత సౌందర్య వంతుడవైన నీవు దేహమంతా చితిపై భస్మాన్ని దేహమంతా చల్లుకొనే అలవాటు చేసుకున్నావు. కాని నీవు మాత్రం ఈ భువనాల నిర్మాణములో గాని-నీవు నిర్మించినదానిని ప్రళయకాలములో సర్వనాశనం చేసి లయం చేయటములో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయవుకాదా! నీ విధి నిర్వహించటములో ఎలాంటి లోపము చేయని నీతత్వం అర్ధంకాదు కదా! దేవా!

 

ఏకభార్యా ప్రకృతి ముఖరా చంచలా చ ద్వితీయ

పుత్ర స్త్యేకో భువన విజయీ మన్మథో దుర్నివారః

శేషశ్శయ్యా శయనందదౌ వాహనం పన్నగారిః

స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారిః

 

విష్ణువు ఇద్దరు పత్నుల్లో తొలిభార్య జ్యేష్టాదేవి మహా వాచాలి అంటే   అతి వాగుడుకాయ - ద్వితీయ కళత్రం అంతే శ్రీ మహాలక్ష్మి సంపదలనిచ్చేదైనా మహా చంచల, క్షణ క్షణం స్థలం మార్చేది. ఏడేడు పదునాల్గు భువనాల జయించగల శక్తి సంపన్నుడు మన్మధుడు, కాని మాట వినని కడు స్వాతంత్ర ప్రియుడు. తన పడక సర్పం,  పడక గది అంభొది సముద్రం. వాహనం ఒక పక్షి - ఇల్లు చూద్ధామా అంటే ఇంత చిరాగ్గా దయనీయంగా ఉంది. తలచుకొని తలచుకొని యేమీ చెయ్యలేక కొయ్యబారి పోయాడట విష్ణువు ……… పూరీ జగన్నాధుడు కొయ్య మూర్తే కదా!


మరింత సమాచారం తెలుసుకోండి: