భారత దేశవ్యాప్తంగా ప్రస్తుతం మతాతీతంగా సోదరీ సోదరులు తమ అత్మీయబందం కలకాలం విలసిల్లాలని ఆ దైవాన్ని కోరుతూ జరుపుకొంటున్న పండగే రక్షాబందనం. ఆరోగ్యకరమైన ఈ పండుగ ద్వారా విరాజిల్లే ఈ విశ్వవ్యాపిత ప్రేమైక జీవనాన్ని మించిన అనుబంధం మరొకటిలేదు. అమ్మ కొడుకుల అనుభందంలో కన్న ప్రేగు రక్త సంబంధం, ఇది తప్పని బంధం దైవికం.  భార్యాభర్తల ప్రేమలో దాంపత్యబంధం కొన్ని సామాజికం ప్రయోజనాల సమన్వితం. కాని సోదరీ సోదర బంధం మానసికం త్యాగానురాగాల సమన్వితం. ఇది విశ్వప్రేమ.  

 

పౌరాణిక నేపధ్యం: ప్రమథగణాధినేత పరమేశ్వరుని ప్రియసుతుడు, విఘ్నేశ్వరునికి ఒక పురాణ సంఘటన ప్రకారం - సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలని వారి సంతానమే క్షేమం లాభం అని అంటారు. విశ్వానికి శుభం కలగచేయటానికి ఆ పరమేశ్వరుడు - ఈ కుటుంబ యజమాని విఘ్నేశ్వరుడు ద్వారా విఘ్ననివారణే కాక, సిద్ధి ద్వారా కోరుకున్న ఆకాంక్షలను నెరవేర్చటం, బుద్ధిద్వారా తగిన విజ్ఞానాన్ని పొందేలా అనుగ్రహించటం, క్షేమం ద్వారా కుటుంబాలకు రక్షణ మరియు సంక్షేమం, లాభుని ద్వారా సర్వత్రా లాభం పొందేలాచేయటం అనీవేళలా జరుగుతునే ఉన్నాయి.

 

ఇంతా జరుగుతున్నా భక్త జనులకు అసంతృప్తి లేదా ఏదో లోపం ఉందని గ్రహించిన క్షెమా లాభులు తమతండ్రి గణపతి ని తమననసులో కూడగట్టుకున్న ధ్యైన్యాన్ని వివరిస్థారు. అప్పుడు గణేశుడు తన ఫివ్య దృష్ఠి ద్వారా పరికించి ప్రజలకెన్ని ఉన్నా తృప్తి ఆనందం సంతోషం అవసరమని తెలుస్తుంది. ఆ విషయమే తన కుమారులకు వివరిస్తాడు.

సర్వదా భక్తజన శ్రేయస్సు కోరే క్షేమ లాభులు విశేషంగా అలోచించి సంతోషం అందించే అధిస్టాన దేవతను తమసోదరి గా ప్రసాదించమని, సోదరిద్వారా అందే ఆ ఆత్మీయ ఆనందాలను తమకూ కావాలని కోరతారు. దానికి ఉబ్బితబ్బిబ్బైన గణేశుని కన్నుల ఆనందభాష్పాలు జాలువారి ఆయన పాద పద్మాల చెంత ఉన్న పద్మం పై పడతాయి. ఆ భాష్ప జలధార లే పద్మం నుండి ఒక పద్మముఖి గా రూపుదిద్ధుకొని "సంతోషిమాత" ఉద్భవిస్తుంది. ఆమెనే తన కుమారులకు సోదరిగా ప్రసాదిస్తాడు గణేషుడు, అంతే కాక ఆమెచేతే కుమారులను సోదరీ సోదర బందం తో రక్షాబందనం ధరింప చేయటం ద్వారా ఒక అత్మీయ బందాన్ని సృష్టిస్తాడు. ఆమె సంతోషిమాతా జన్మదినాన్నే రక్షాబందన దినోత్సవంగా జనులు పండుగ చేసుకుంటారు.


 

చారిత్రాత్మక నేపధ్యం: గ్రీక్ సార్వభౌముడు అలగ్జాండర్  విశ్వాన్ని జయించే తన ప్రణాళికలో భాగంగా భారత్ పై దండయాత్ర చేసి అంభి అనే దురాశా  పరుడైన కాశీ రాజును ధన కనక వస్తు వాహనాలను సమర్పించి భారత్ లో జైత్రయాత్ర ప్రారంభిస్తాడు. తదుపరి పురు రాజ్యాదీశుడైన పురుషోత్తమునితో భీకర పోరాటం జరుపుతాడు. ఒక దశలో తన పురుషొత్తముని యుద్ధములో జయించటం కష్టమని తనకు పతనాన్ని రుచిచూపించిన పురుషోత్తమునిపై తనప్రేయసి రుక్సానాతో రక్షాబందనం చెసేలా ఆమెకు తెలియకుండానే ప్లాన్ చేస్తాడు. రుక్సానాను రక్షాబందనం ద్వారా సోదరి గా పొందిన పురుషొత్తముడిలొ ఆత్మీయతా భావం నెలకొంటుంది.  తదుపరి యుద్ధం చేస్తూ అలగ్జాండర్ పై కరవాలం ఝుళిపించినప్పుడు తన చేతికి కట్టిన రాఖీలో రుక్సానా ప్తతి బింబం కనిపిస్తుంది. ఆ ఆత్మీయతే పుతుషోత్తముని యుద్ధములో ఓడిపోయేలా చేస్తుంది. 

 

ఆ సోదరి కోసం రాజ్యాన్ని తనసర్వస్వాన్ని కోల్పోయాడు పురుషొత్తముడు. తనలో సోదరి కోసం ఒక సోదరుడు చూపే ఆత్మీయతాభావమే త్యాగానికి పురికొల్పింది. సోదరి కోసం ఎంతైనా త్యాగం చేసే సోదరులెందరో ఉన్నారు చరిత్రలో. ఉదాహరణకు చత్రపతి శివాజి, ఔరంగజేబ్, అక్బర్, ఎలా ఎందరో. ఒక ఆత్మీయ సోదరీ సోదర అనుబంధం చరిత్రగతినే మార్చిన సంధర్భాలు కోకొల్లలు.

 

రక్షాబందనలో విషువు తనమాయను జొప్పించి దానికి అంటే సహోదర భావనికి దైవత్వం ఆపాదించాడు. అందుకే రేపు మనకు రాఖీ కట్టబోయే సోదరీమణులకు సకల సుఖశాంటులు కలగాలని దీవిస్తూ స్వంత సోదరుడైనా, మానసికంగా ఆ భావనలో ఉన్న సొదరుడైనా ఆ సోదరిని సంతొషంగా జీవించాలని దీవిస్తూ...జీవితాంతం ఆమెకు అవసరాల్లో కాని కష్టాల్లోగాని రక్షణ కలగచేస్తానని అభయం ఇవ్వటం ఆ సోదరుని కర్తవ్యం.

రక్షాబంధనం ఒక అపూర్వ భావన..

 

మరింత సమాచారం తెలుసుకోండి: