భారత దేశంలో  ఎక్కువ మంది పూజించే మొక్క తులసి. ప్రతి హిందువు ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది..తులసీ మాత చుట్టూ ప్రదక్షణలు చేస్తే మహిళలు తాము కోరుకున్నవన్నీ నెరవేరుతాయని అంటారు. అంతే కాదు తులసి ఆకు, గింజలు అద్భుతమైన ఔషదాలు కూడా పని చేస్తుంటాయి. పూర్వ కాలం నుంచి తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసితో అల్లిన మాల అంటే అందరు దేవుళ్లకి మహా ఇష్టం. దైవారాధనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఇంటి ఆవరణలోనూ తులసి మొక్క వుంటుంది. తులసీ పూజ చేస్తే ఆ కుటుంబానికి సిరిసంపదలకు ఎలాంటి లోటువుండదని పండితులు అంటున్నారు. తులసి మొక్క ప్రత్యేకంగా ఏ ఇంట్లో పూజించబడునో ఆ ఇంట సర్వసంపదలు కలుగును.

తులసి మొక్క లేని ఇంట్లో సమస్త సమస్యలు ఏర్పడును.రోజు ఒక తులసిదళం నమిలిమింగితే సమస్తరోగాలకు నివారణ కలుగును.తులసి మొక్కలపై నుండి వచ్చే గాలి పీల్చిన చాలా ఆరోగ్యప్రదం.లక్ష్మీదేవికి ప్రతిరూపమే తులసి.విష్ణుమూర్తికి ప్రీతికరమైనది.అందుకే ఆమెకు హరిప్రియ అనే మరోపేరు కూడా ఉంది.సత్యభామ నిలువెత్తు బంగారం ఉంచినా తూగని ఆ విష్ణువు రూపుడైన ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి సమర్పించిన ఒకే ఒక్క తులసీదళానికి వశుడయ్యాడు.

అంతే కాదు హనుమంతుడు సీతమ్మ తల్లికోసం లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఆవరణలో తులసి మొక్కను చూసి ఆ గృహిణి గురించిన అంచనా వేస్తాడు. చాలా దేవాలయాల్లో తులసి నీరే తీర్ధంగా ఇస్తారు.ప్రతి రోజు నీళ్ళుపోసి, భక్త్, శ్రద్ధలతో తులసిమాతను ఆరాధిస్తే ఇంట్లో లక్ష్మీకళ తాండవించి, సకలసంతోషాలను మనకు ప్రసాదిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: