శివలింగ పూజ చేసేందుకు కాశీ నుంచి లింగాన్ని తీసుకురావాలని హనుమంతుడిని ఆదేశించాడు రాముడు. పుణ్యకాలం ముగిసే సమయం ఆసన్నమవడం.. హనుమంతుడింకా రాకపోవడంతో శ్రీరాముడు ఇసుకతో శివలింగాన్ని చేసి పూజ చేశాడు. పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలిగిన క్షేత్రంగా 'జమ్ములపాలెం' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.


మహాశివరాత్రి నాడు పాదరస శివలింగాన్ని పూజించినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది. పాదరస శివ రూపాన్నినిత్యం పూజిస్తూ విశిష్ట పర్వదినాల్లో ప్రత్యేకంగా కొలిచి సుఖసంతోషాలను, సర్వ సంపదలను సొంతం చేసుకోవచ్చు.  సాధారణంగ శైవ క్షేత్రాల్లో ఒకటికంటే ఎక్కువగానే శివ లింగాలు కనిపిస్తుంటాయి. అయితే ఈ క్షేత్రంలో ఒక వేయి నూట పదహారు శివలింగాలు ఒక వరుస క్రమంలో దర్శనమిస్తూ ఉంటాయి. ప్రధానమైన శివ లింగం మాత్రం ఐదు ముఖాలను కలిగి ఉంటుంది. ఇక ఈ శివలింగం గర్భాలయంలో కాకుండా మంటపంలో ఉండటం మరో విశేషం.ఈ శివలింగానికి అభిషేకాలు చేయించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు.


 శివలింగ పూజ చేసినవారు ముల్లోకాలలోని శివలింగాలకు పూజ చేసినట్లే అని తెలిపారు. శివలింగం మహా దివ్యమైంది, శక్తివంతమైంది.  ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ దోషాలు తొలగిపోవడానికి గాను, అభిషేకాలు చేయిస్తుంటారు. ఇక్కడి అనేక శివలింగాలను ఒక్కసారిగా దర్శించడం వలన, మనసే శివమందిరమైనట్టుగా అనిపిస్తుంది .. సదా సదాశివుడి ధ్యానంలో వుండిపోవాలనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: