నేడే  శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ పరమాత్ముని యోగీశ్వరుడుగా ఒక్కసారి స్మరించుకుందాం! చేసిన పాపాలు పరిహారమౌతా యంటారు.

హిందూ దైవం శ్రీమహవిష్ణువు దశావతారాల్లో ఎనిమిదవ అవతారం, తల్లి దేవకీ దేవి అష్ఠమ గర్భాన,  శ్రావణ బహుళ  అష్థమి రోజున జన్మించినట్లు హిందూ పురాణాలు చెప్పుతున్నాయి.  ఆ దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మం క్రీస్తు పూర్వం 3112* సంవత్సరం సంభవించినదిఆరోజే కలియుగ ప్రారంభమని ద్రిక్-పంచాంగ్ పై జ్ఞానమున్న పండితులు చెప్పుతున్నారు. దీని ప్రకారం భగవానుడు 126 సంవత్సరాల 5 నెలలలు-ఈ భూమిపై తన అవతారం లో జీవించారు. ఈ సంవత్సరం 2016 కాబట్టి మనం ఈ సంవత్సరం చేసే శ్రీకృష్ణ జన్మదినం 5128 వ జన్మదినమన్నమాట


మరింత సమాచారం తెలుసుకోండి: