గ్రామానికో గుడి ఉంటుంది. కానీ గుడికోసం గ్రామం ఉందిక్కడ. లేక గుళ్లు మాత్రమేగల గ్రామాలుంటాయి. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ లో క్షిప్రా నదీతీరంలో ఉజ్జయిని నగరం ఉంది. దీనినే ఇంద్రపురి అనీ అమరావతీ లేక అవంతికా అని కూడా పిలుస్తారు. ఇక్కడి వందలాది గుడుల గోపురాలపైగల స్వర్ణతాపడాలవల్ల దీనిని "స్వర్ణశృంగ" అని కూడా పిలుస్తారు.


మోక్షదాయకం అయిన సప్త నగరాలలో ఒకటయిన ఈ అవంతికానగరంలో 7సాగర తీర్ధాలు, 28 తీర్థాలు, 84సిద్ధలింగాలు, 25-30శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రస్థానాలు, వేలాది దేవతామందిరాలు, జలకుండాలూ, స్మారకాలూ ఉన్నాయి. 33కోట్ల దేవతలూ ఉండే ఇంద్రపురి ఈ ఉజ్జయినిలోనే ఆ దేవతలంతా ఉన్నారనిపిస్తుంది.


అవంతివాసి అయిన ఒక బ్రాహ్మణునికి నలుగురు శివభక్తులైన పుత్రులుండేవారు. బ్రహ్మ నుంచి వరం పొందిన దుష్టదైత్యరాజు దూషణుడు అవంతీనగరానికి వచ్చి అక్కడి నివాసులైన వేద బ్రాహ్మణులను చాలా కష్టాలపాలు చేయనారంభించాడు. కానీ శివధ్యానం చేసే బ్రాహ్మణులు కించిత్తు కూడా భయపడలేదు. దైత్యరాజుతన నలుగురు అనుచరులను నగరంలో ఎక్కడా కూడా వైదిక ధర్మానుష్ఠానం జరగకుండా చూడమని ఆదేశించాడు. రాక్షసులచే పీడితులయిన ప్రజలు బ్రాహ్మణుల వద్దకు వచ్చారు. బ్రాహ్మణులు ప్రజలకు ధైర్యం చెప్పి శివపూజలో నిమగ్నులయ్యారు. ఇదే సమయంలో దూషణ రాక్షసుడు తన సేనతో కలిసి ఆ బ్రాహ్మణుల మీదకి లఘించాడు. తక్షణమే పార్థివ మూర్తి ఉన్న స్థానంలో ఒక భయానకమైన శబ్ధంతో భూమి బ్రద్ధలైంది. అక్కడ ఒక పెద్ద అగాథం ఏర్పడింది. ఆ అగాథంలోనే శివుడు ఒక విరాట రూపధారి అయిన మహికాళ రూపంలో ప్రకటితం అయ్యాడు. శివుడు ఆ దుష్టుడ్ని బ్రాహ్మణుల వైపుకైనా రాడానికి వీలులేకుండా శాశించాడు. కానీ ఆ రాక్షసుడు శివుని మాటను పెడచెవిని పెట్టాడు. ఫలితంగా శివుడు తన ఒకే ఒక్క హుంకారంతో ఆ రాక్షసుడ్ని భస్మం చేశాడు. శివుడ్ని ఈ విధంగా చూసిన బ్రహ్మ, విష్ణు మరియు ఇంద్రాది దేవతలు వచ్చి శివుణ్ణి స్తుతించారు.


మహాకాళేశ్వరుని మహిమ అవర్ణనీయం. ఉజ్జయిని నరేశుడైన చంద్రసేనుడు శాస్త్రజ్ఞుడైన శివభక్తుడు కూడా. అతని మిత్రుడు, మహేశ్వరుని గణంలో ఒకడైన మణి భద్రుడు. అతనికి ఒక సుందర చింతామణిని ఇచ్చాడు. చంద్రసేనుడు దానిని మెడలో ధరించినప్పుడు ఎంత తేజస్సుతో కనిపించే వాడంటే.. దేవతలకు కూడా ఈర్ష్య కలిగేది. కొంత మంది రాజులు ఆ మణినిమ్మని కోరితే రాజు నిరాకరించాడు, కానీ వారు చంద్రసేనుడ్ని ముట్టడించారు. తనను అందరూ ముట్టడించారని గమనించి చంద్రసేనుడు మహాకాళుడి శరణు జొచ్చాడు. శంకర భగవానుడు ప్రసన్నుడై, అతడ్ని రక్షించే ఉపాయం తయారు చేశాడు. సంయోగవశాత్తూ, తన పుత్రుణ్ని ఎత్తుకుని ఒక బ్రాహ్మణ స్త్రీ తిరుగాడుతూ, మహాకాళుడ్ని సమీపించింది. ఆమె వెంటనే విధవ అయిపోయింది. విద్యాహీనుడైన బాలకుడు మహాకాళేశ్వర మందిరంలో రాజు శివపూజ చేస్తూండటం చూశాడు. బాలుని మనసులో కూడా భక్తిభావం మొలకెత్తింది. ఒక చక్కని రాతిని తెచ్చి, తన ఖాళీగా ఉన్న ఇంటిలో స్థాపించి, దానినే శఇవలింగంగా భావించి పూజించనారంభించాడు. భజనలో లీనుడైన - బాలునికి ఆహారాధికాలు ఏమీ కూడా జ్ఞప్తికిలేవు. అప్పుడతని తల్లి అతడ్ని  పిలవటానికి వెళ్ళింది. ఎన్నిసార్లు పిలిచినా భక్తిలో లీనుడైన బాలుడు వినిపించుకోలేదు. దాంతో మాయామోహజాలంలో చిక్కుకున్న తల్లి ఆ శివలింగాన్ని దూరంగా విసిరేసి, అతడి పూజకు భంగం కలిగించింది. తనతల్లి చేసిన ఈ పనికి ఖిన్నుడైన బాలకుడు శివధ్యానం చేయసాగాడు. శివకృప కలగటానికి ఎంతో సేపు పట్టలేదు. గోపి పుత్రుని ద్వారా పూజింపబడిన పాషాణం రత్నఖచిత జ్యోతిర్లింగంగా ఆవిర్భూతమైంది. శివస్తుతి వందన తరువాత, బాలుడు ఇంటికి తిరిగి వెళ్లేసరికి, తన కుటీరపు స్థానే, ఒక సువిశాల భవనం ఉంది.  ఈవిధంగా శివకృపవల్ల బాలుడు అపార ధనధాన్యాదులతో సంపన్నుడై సుఖజీవనం సాగించాడు.


ఇటువైపు శత్రు రాజులు చంద్రసేనుని నగరంపై దాడిచేస్తూ వారు తమలో తామే రాజచంద్రసేనుడెంతటి గొప్ప శివభక్తుడో గదా అని అచ్చెరువొంద సాగారు. ఉజ్జయిని మహాకాళుని నగరం కూడాను. దీనిని గెలవడం అసంభవం, అని అనుకుని శత్రురాజులు చంద్రసేనునితో మైత్రి చేసుకున్నారు. అందరూ సమిష్ఠిగా మహాకాళుని పూజించారు.


అప్పుడే, వానరాధీశుడైన హనుమంతుడు అక్కడ ప్రత్యక్షమై ఆ రాజులకు శివుడు తప్ప, మరొక దేవుడెవరూ కూడా, మరుజన్మ లేని ముక్తినీయలేరని చెప్పాడు. మంత్రపఠనం లేకుండా పూజించినా ప్రసన్నుడయ్యే దైవం శివుడేని తెలియచెప్పాడు. గోవ పుత్రుని ఉదాహరణను చెప్పాడు. తరువాత హనుమంతుడు తన కృపాదృష్టిని, స్నేహపూర్ణ దృష్టినీ చంద్రసేనునిపై కురించి, అంతర్ధానం అయ్యాడు.


సంస్కృత విద్యకు ఆద్యపీఠం, ధర్మం, జ్ఞానం మరియు కళలకు త్రివేణి సంగమం ఇదే. ఈ నగర వైభవం మౌర్య, గుప్త మరియు ఇతర రాజులు పెంచారు. సంవత్సర కర్త విక్రమాదిత్యుని సామ్రాజ్యానికి ఉజ్జయిని రాజధానిగా ఉండేది. ఇక్క రాజా భర్తృహరి యొక్క విరహగాథ, నీతి శతకం, వ్రద్యోత రాజకన్య వానవదత్త మరియు ఉదయనుల ప్రేమకథ, ఈ నగరపు ప్రకృతి సౌందర్యాదుల సుందర వర్ణన, అనేక రచయితలు వ్రాశారు. ఉదయపు మంగళ సమయంలో నగర స్ర్తీలు కుంకుమ మిశ్రిత జలాన్ని ప్రాంగణంలో జల్లి, దానిపై ముగ్గులతో అలంకరించేవారు.


క్షిప్రానది ఒడ్డున గల ఉజ్జయినిలో ఈ మహాకాళ శివ మందిరంలో ప్రాతఃకాలంలో నాలుగు గంటలకు పూజ జరుగుతుంది. అభిషేకానంతరం మహాకాళునికి చితాభస్మం పూయబడుతుంది. శాస్త్రాల ప్రకారం చితాభస్మం అశుభంగా భావించబడింది. సాధారణంగా చితాభస్మం తాకితే స్నానం చేసి తీరాలి. కానీ మహాకాళ శివుణ్ణి స్పర్శించిన చితాభస్మం పవిత్రమైంది. ఎందుకంటే శివుడు నిష్కర్ముడు. ఆయనలో కామం లేదు. అందుకే శివుడు మంగళమయుడు. 


శివమహిమా స్తోత్రంలో ఇలా వర్ణించబడింది :
చితాభస్మోలేవః స్రగషి నృకరోతి పరికరః
అమంగళ్యం శీలం తవ భవతు నామైవఖిలం
తథాపి స్మతృణాం వరద పరమం మంగళమసి.


ఈ విధముగా శివుడు మంగళమయుడు, సుందరుడు అవంతీ నగరం శివునికి ప్రియమైనది. మహాకాళుడ్ని దర్శించిన వారికి దుఃఖం ఉండదు. మానవులు ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఎలా ఉపాసన చేస్తే ఆ విధంగా మనోరథ సిద్ధి కలుగుతుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది  శ్రీ ఓంకారేశ్వరుడు. క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: