Image result for Hindu God Sri Krishna beautiful images

గుణాత్మక జీవన విధానాన్ని జీవించే ఘటనా అఘటన సామర్ధ్యం తో లెక్కించవచ్చు. ప్రతిపనికి దానిని పూర్తిచేయటానికి సామర్ధ్యం కావాలి. సంస్కృత కవి బర్తృహరి ప్రకారం "కనపడకుండా ఉన్నదాన్ని ప్రత్యక్షంగా అంటే కనపడేఅలా, ప్రాణాలు తీసే విషాన్ని అమృతంగా మార్చటాన్నే సమర్ధత అన్నారు. ఇలాంటి శక్తి గలవారినే ఘటనా అఘటన సమర్ధులంటారు. అఘటనం అంతే గతములో జరగని పని అఘటనం అంటే జరగటం అని అర్ధం. గతములో ఎన్నడూజరగని పనిని దానిని ఇప్పుడు చేయటం అన్నమాట. 

Image result for god manmadhudu

నిద్రలేవటం, కాలకృత్యాలు ముగించటం, వంటచేయటం, తినటం, తాగటం, మన వృత్తులను నిర్వహించటం పనులే కాని అవన్నీ "రొటీన్" అంటే సహజంగా చేసేవి, లేదా జరిపోయే సమర్ధతను ఉపయోగించవలసిన అవసరం లేని పనులు. అసాధ్యమైన పనులను సాధించటమే సామర్ధ్యం అంటారు. చరిత్ర సృష్టించదలచిన వారు అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తారు. వీరికి మనవాడే పనిముట్లలోని లోపాన్ని కూడా లెక్కచేయరు. వారి పనిలో భాగంగానే పనికి రాని పరికరాలను కూడా సవరించి ముందుకు పని కొనసాగేలా చెస్తారు. వారు తమ లోపాన్ని ఇతరులపై, తాము వాడే పరికరాలపై తమ వైఫల్యాలను నెట్టివేయరు. 

Image result for hindu sun god

మహాత్మాగాంధి స్వాతంత్ర సాధనలో నిరుపేద భారత ప్రజలనే ఐశ్వర్యవంతమైన బ్రిటీష్ పాలకులపై ప్రయోగించారు. ఇక్కడ పేదరికం అనే పరికరాన్ని "ఐకమత్యం" అనే గుణాన్ని జోడించి తనదైన స్వాతంత్ర సాధన అనే గమ్యాన్ని సాధించారు గనకనే ఆయన్ను "ఘటన అఘటన సమర్ధుడు" అన్నారు. కార్య సాధకులకు దారిలో అడ్డొచ్చే ప్రతి అవరోధమూ క్రొంగొత్త ఆవిష్కరణకు దారితీస్తుంది. 

Image result for mahatmagandhi images

సామర్ధ్యానికి మనం గమనించే రెండు విషయాలను పరిశీలిద్ధాం. రోజూ తన గమనములో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని చేదించి ముందుకుసాగే ఆ ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. ఏ ఒక్క రోజూ తన శక్తిని, వెలుగుని ఈ విశ్వానికి అందించటములో ఆలస్యంగాని, నిర్లక్ష్యంగాని, అలసటగాని, నీరసంగాని, వాయిదాకాని ప్రయోగించకుండా నిరంతరం సాగిపోయే కృషీవలుడు. ఆయన వలననే ఈ జగత్తంతా ఉద్దీపితమై, శక్తివంతమై, ఉత్తేజితమై కొనసాగుతుంది. అందుకే ఆయన ఘటనాఘటన సమర్ధుడు.

Image result for Hindu God Manmadha Beautiful Images

అలాగే మన్మధుడు. సృష్టి కొనసాగటానికి ఆయన ఒక ఉత్ప్రెరకము. నిరంతర శ్రామికుడు. ఆయనే లేకుంటే ఈ జగత్తు పై జీవానికి జీవ జాతులకు మానవులకు జనన మరణాలు ఉండవు. ఆయన శరీరమే లేని అనంగుడు. ఆయన పనిముట్లు అతి సున్నితమైనవి సామర్ధ్యం లేనివి. ఆయన బాణం పూలతోచేసింది. చాల శక్తిహీనమైనది. వింటి నారి తుమ్మెదల బారు. అంటే స్థిరత్వం లేనివి. ఆయన గారి సహచరుడు చంద్రుడు అతి చల్లనివాడు.

Image result for Hindu God Kamadeava beautiful images

ఇంతా చేసి దేహం లేని తాను అశక్తివంతాలైన తన పనిముట్లతో ఈ అనంత విశ్వములో సకల చరాచర జగత్తు నిరంతరం కొనసాగేలా సృష్టికి మూలాదారమైన శృంగారాన్ని పెంపొండించే ఉత్ప్రేరకమై నిరంతరంగా జననాలకు కారణమైన ఘటనాఘటన సమర్ధుడయ్యాడు.

Image result for Hindu God Kamadeva beautiful images

అంటే అశక్తుడు అసహాయ స్థిలో ఉండే పరికరాలనే వినియోగించుకొని సృష్టి కొనసాగించటములోని రహస్యం ఆయన మనసులోని "సంకల్పము" మాత్రమే కాని వేరేదీ కాదు.  వైఫల్యాలకు నెపాలను వెతకకుండా ఉన్నంతలోనే, అనన్యసామాన్యాలను సాధించటం "సంకలపమాత్రము" చేతనే సాధ్యము కాబట్టి సంకల్పబలం తోనే ముందుకుకొనసాగి ఘటనాఘటన సమర్ధులమవ్వాలి.   
  
   Image result for god manmadhudu

మరింత సమాచారం తెలుసుకోండి: