durga devi alankaraM naivedyam కోసం చిత్ర ఫలితం

దేవీ నవరాత్రులలో ఆ ఆదిపరాశక్తికి అలంకారములు నివేదన చేయవలసిన నైవేద్యములు:


  1. పాడ్యమి రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి లేదా శ్రీ శైలపుత్రిగా దర్శనమిస్తారు ఆ రోజు చలిమిడి, వడపప్పు, పాయసం నైవేద్యంగా పెట్టి పూజిస్తారు.


2. విదియ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి గా దర్శనమిస్తారు. తీయటి బూంది, శనగలు నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తారు.


3. తదియ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి గా దర్శనమిస్తారు. రవ్వకేసరి, పులిహోర ఈ మాతకు నైవేద్యంగా సమర్పించి అమ్మను ధ్యానిస్తారు.


4. చవితి రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి గా దర్శనమిస్తారు. పొంగలి ఈ దేవ దేవికి నైవేద్యంగా నివేదించి బహుభక్తి భావంతో ప్రార్దిస్తారు.


5. పంచమి రోజు అమ్మవారు శ్రీ లలితా దేవి గా దర్శనమిస్తారు. పులిహోర పెసరబూరెలు అమ్మవారికి నివేదన జరిపి తమ కోరికలు ఫలించాలని పూజిస్తారు. 


6. షష్టి రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనమిస్తారు. బెల్లం లేదా పంచధార తో చేసిన  క్షీరాన్నం నివేదనగా నైవేద్యం సమర్పించి కొలుస్తారు.


7. సప్తమి రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి గా దర్శనమిస్తారు (మూలా నక్షత్రం రోజున) అటుకులు, కొబ్బరి, శనగపప్పు, బెల్లం నివేదించి పూజిస్తారు. 

durga devi alankaraM naivedyam కోసం చిత్ర ఫలితం

8. అష్ఠమి రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి గా దర్శనమిస్తారు (దుర్గాష్ఠమి) గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు నైవెధ్యం పెట్టి బభ్ భక్తి తత్పరతతో పూజిస్తారు.


9. నవమి రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని గా దర్శనమిస్తారు (మహర్నవమి) చక్రపొంగలి నైవేద్యం సమర్పించి అమ్మవారిని ఎంతో భక్తితో మనసారా పూజిస్తారు.


10. డసమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి గా దర్శనమిస్తారు (విజయ దశమి-దసరా) పులిహోర, గారెలు నైవేద్యమిచ్చి సకల షొడశార పూజ జరిపి తమకోరికలు తీర్చమి కోరుతూ శరన్నవరాత్రుల పూజ, నోము, వ్రతం ముగిస్తారు.


                  
సృష్ఠి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ విష్ను మహేశ్వరులు దైవోత్తములు. సృష్ఠి కర్త బ్రహ్మ కంటే స్థితిని ప్రసాదించే విష్ణువు ఆపైన లయమిచ్చే శివుడు గొప్పవారు. వీరందరికి ఆ శక్తిని ప్రసాదించే ముగ్గురమ్మలకు మూలపుటమ్మైన శివపత్ని ఆ ఆదిపరాశక్తి, జగదాంబ జగన్మాత గా ప్రసిద్దికెక్కింది. అందుకే ఆదేవిని:



అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలపె
ద్దమ్మ! సురారులమ్మ కడుపారగ పుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పులటమ్మ, మనమ్ముల నుండెడియమ్మ దుర్గ!మా
యమ్మ కృతాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

durga devi alankaraM naivedyam కోసం చిత్ర ఫలితం


అని బమ్మెర పోతనామాత్యులవారు దేవీ భాగవతములో ప్రవచించారు. ఆయమ్మనే దుర్గ, భవాని, శ్రీదేవి, శ్రీ మహాలక్ష్మి, చండి, మహశక్తి, సరస్వతి అనేకానేక పేర్లతో పూజించటం మన ఆనవాయితీ గా వస్తుంది.

durga devi alankaraM naivedyam కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: