ఉదయం లేచిన వెంటనే స్నానాధికాలు ముగించుకుని తులసి చెట్టుకు పూజ చేయడం హిందువుల సంప్రదాయం. కేవలం రెండింటిలో మాత్రమే సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. అందులో ఒకటి గోవు కాగా, రెండోది తులసి. జంతువులలో గోవు, మనుషులలో జ్ఞాని, సస్యములలో తులసి చాలా ప్రత్యేకమైనవి. తులసి అంటే తులనము లేని సస్యము అని అర్థం. అంటే దేనితోనూ సమానం కానిది అని..! తులసికి ఆది దేవత సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవియే..!! సాలగ్రామము లేనిదే పుణ్యతీర్థము లేనట్టే.. తులసి లేనిదే పూజ లేదు.. అంతెందుకు తులస్యుపనిషత్ అని ఓ ఉపనిషత్తే ఉన్న తర్వాత తులస