హిందువులకు ఉన్నన్ని దేవతామూర్తులు మరే మతానికి ఉండరు. ఎందరో దేవుళ్లు.. మరెందరో దేవతలు.. ఒక్కొక్కరిని ప్రసన్నం చేసుకునేందుకు వేర్వేరు పద్ధతులు. ఒకరికి ఒక రోజు ఇష్టం.. మరొకరికి మరో రోజు ఇష్టం. ఒకరికి ఓ ప్రాణి ఇష్టమైతే మరొకరికి మరో ప్రాణిపై మక్కువ. ఇలా ఎన్నో వింతలు విశేషాలు. అలాగే వారికి ఇష్టమైన ఆహారపదార్థాలకు అనుగుణంగా భక్తులు ఆయా దేవతలకు నైవేద్యాలు పెడుతుంటారు. సాధారణంగా అర్చనల తర్వాత తమ దేవతలు, దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాలు పెడుతుంటారు.