పూర్వమొక కుందేలు మేతకై పోవలసి తన పిల్లల నెచట దాచుటకును కుదరక వేకువ జామునందే తీసికొనిపోయి చాకి బానలో నుంచి మేతకై పోయినది. ఇంతలో చాకిరేవునకు వచ్చిన చాకలి బానలో చూడకయే నీళ్ళుపోసి క్రింద మంట పెట్టెను. అంతలో మేతలకు పోయిన కుందేలు తిరిగివచ్చి చూచి పిల్లలకు ప్రమాదము వచ్చినట్లు తెలిసికొనినందన రోదనము చేయుచు ఆ బానచుట్టు తిరుగుచు -