మేష రాశి     => ఆదాయం: 11;        వ్యయం: 05;        గౌరవం: 02;      అవమానం: 04. వృషభ రాశి   => ఆదాయం: 05;        వ్యయం: 14;       గౌరవం: 05;      అవమానం: 04. మిథున రాశి  => ఆదాయం: 08;        వ్యయం: 11;       గౌరవం: 01;      అవమానం: 07. కర్కాటక రాశి => ఆదాయం: 02;        వ్యయం: 11;       గౌరవం: 04;      అవమానం: 07. సింహ రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 05;       గౌరవం: 07;      అవమానం: 07.   కన్యా రాశి    => ఆదాయం: 08;         వ్యయం: 11;       గౌరవం: 03;      అవమానం: 03. తులా రాశి   => ఆదాయం: 05;         వ్యయం: 14;       గౌరవం: 06;      అవమానం: 03. వృశ్చిక రాశి  => ఆదాయం: 11;         వ్యయం: 5;        గౌరవం: 02;      అవమానం: 06. ధనస్సు రాశి => ఆదాయం: 14;          వ్యయం: 11;      గౌరవం: 05;      అవమానం: 06. మకర రాశి   => ఆదాయం: 02;         వ్యయం: 08;       గౌరవం: 01;      అవమానం: 02. కుంభ రాశి   => ఆదాయం: 02;          వ్యయం: 08;      గౌరవం : 04;      అవమానం: 02. మీన రాశి   => ఆదాయం: 14;           వ్యయం: 11;      గౌరవం : 07;      అవమానం: 02.   
ఈ రాశి వారికి గురుడు సంవత్సరమంతా షష్టమంలో శని, రాహులు ఇద్దరు సంవత్సరమంతా కూడా దశమంలో, కేతువు చతుర్థ స్థానంలో సంవత్సరమంతం సంచరిస్తున్నారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చును. ఆదాయం: 02 వ్యయం: 08 గౌరవం: 01 అవమానం:02 ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు ఏడాది ప్రారంభం నుండి మొదటి ప్రథమార్థంలో మంచి మంచి ఫలితాలు పొందుటకు అవకాశం కలదు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంటుంది. నూతన పనులను చాలావరకు ఎంతో ఉత్సాహంతో మొదలు పెడతారు కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నవి కొద్దిపాటి ప్రయత్నంతో అవిముందుకు సాగుతాయి. మీరు చేసేపనులకు చాలావరకు ఫలితాలు తోటివారికి వచ్చే అవకాశాలు కలవు. శుభ కార్యములలో పాల్గొంటారు ధర్మసంభంద విషయాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది ధనలాభాలను కలిగి ఉంటారు గతంలో మీకు రావాల్సిన డబ్బులు వసూలు అవుతాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ప్రయాణాల విషయంలో కొంత ఆలస్యంగా పనులు పూర్తి అవుతాయి. కాకపోతే ద్వితియార్థంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం కలదు ఇబ్బందులు తప్పక పోవచ్చును ఖర్చులు కూడా పెరుగుతాయి. తలపెట్టిన పనులలో ముందు ఉన్న ఉత్సాహం చివరి వరకు ఉండకపోవచ్చును ఉద్యోగులకు పెద్దగా ఇబ్బందులు ఉండక పోవచ్చును బాగానే ఉంటుంది. ఉద్యోగులు ఉద్యోగంలో అభివృద్దిని కలిగి ఉన్నప్పటికిని స్థానమార్పిడి మూలాన కొంత నిరాశను పొందుతారు. రైతులకు ఆదాయం బాగుంటుంది పంటలలో దిగుబడి బాగానే ఉంటుంది. క్రీడాకారులకు అలాగే కళాకారులకు మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటారు కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మూలాన మేలు జరుగుతుంది. రాజకీయనాయకులకు మాములుగానే ఉంటుంది కాకపోతే స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం చేత మేలు జరుగుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది లక్ష్యాలను సాదించేందుకు కష్టపడటం అనేది సూచన. స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది చేపట్టిన పనులలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్థులకు బాగానే ఉంటుంది నూతన ఆలోచనలు చేయవచ్చును. చిన్న తరహ పరిశ్రమల వారికి కొంత ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది మనోదైర్యంతో ముందుకు వెళ్ళడం మంచిది. పెట్టుబడుల విషయంలో మాత్రం తప్పక జాగ్రత్తలు పాటించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి వ్యహరించుట మేలుచేస్తుంది. మాసముల వారిగా: ఏప్రిల్: ఖర్చులు బాగాపెరుగుటకు ఆస్కారం కలదు ఇంటిలో మాటపట్టింపులకు వెళ్తారు పనియందు శ్రద్ధను చూపించలేకపోతారు. అనారోగ్యంను అశ్రద్దచేయకండి తగిన జాగ్రత్తలుపాటించుట మేలు. మే: అనుకున్న పనులను పూర్తిచేస్తారు పరిచయాలు బాగా ఉపయోగపడుతాయి. వ్యయానికి తగినట్లుగా ఆదాయం ఉంటుంది అనవసరపు విషయాలకు దూరంగా ఉండటమనేది సూచన. జూన్: కొన్ని అనవసరపు ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది అలాగే అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. నిదానంగానైనా పనులను పూర్తిచేస్తారు. జూలై: ఉద్యోగ స్థానంలో అపుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ యొక్క ఆలోచనల్లో కొంత తికమక ఏర్పడుటకు అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి లక్ష్యాలను సాదించాలన్న ఆలోచన బాగాపెరుగుతుంది. ఆగష్టు: ఆదాయం విషయంలో అభివృద్దిని పొందుతారు ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. శుభ కార్యములలో పాల్గొంటారు విద్యార్థులు ప్రణాళికాబద్దంగా ఉండటం మేలుచేస్తుంది. సెప్టెంబర్: ప్రయాణాల్లో ఇబ్బందులను పొందుతారు చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. అవివాహితులకు అంతగా అనుకూలతలు ఉండకపోవచ్చును. అక్టోబర్: ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలను పొందుతారు వివాదములకు దూరంగా ఉండటం సూచన. దైవ సంభంద పనులకు సమయాన్ని కేటాయించుట మేలు చేస్తుంది. నవంబర్: ప్రతి విషయంలోను శ్రద్ధను చూపండి అలాగే ముఖ్యమైన విషయాల్లో అశ్రద్దవద్దు. బందువర్గం నుండి విమర్శలు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రతగా ఉండండి. వ్యాపారస్థులు ఒంటరిగా కాకుండా పెద్దల సూచనలు పాటించుట మేలు. డిసెంబర్: ఉద్యోగంలో అభివృద్దిని పొందుతారు సంతోషాన్ని పొందుతారు కుటుంభ సౌఖ్యంను కలిగిఉంటారు కాకపోతే ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. జనవరి: అనారోగ్యం మూలాన తిప్పలు తప్పక పోవచ్చును. ఆపరేషన్లు అయ్యే అవకాశాలు కలవు జాగ్రత్తగా ఉండండి. మీ శ్రమకు తగ్గ ఫలితాలు పొందుటలో విఫలం అవుతారు. వాహనములు నడుపునప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కుటుంభంలో తొందరపాటు విధానాలు చేయకండి ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుట మేలు. వివాహాది యత్నాలు ముందుకు సాగుతాయి. మార్చ్: ఇతరులకు సంభందించిన విషయాల్లో తలదూర్చవద్దు వివాదములకు దూరంగా ఉండండి. మాసం చివరకు అనుకున్న పనులను పూర్తిచేస్తారు. పూజలు: ఆదిత్యహృదయ పారాయణ మేలు చేస్తుంది శివునకు అభిషేకాలు తరుచు చేయించుట మేలు చేస్తుంది ప్రతినిత్యం దక్షిణామూర్తిని పూజించుట కూడా మేలు చేస్తుంది ప్రతి సంకష్ట హరచతుర్థికి గణపతిని పూజించుట ఉపవాసం ఉండుట మేలు చేస్తుంది శనివారాలు శివాలయం వెళ్ళడం నవగ్రహలకు ప్రదక్షణలు చేయుట ఫలితాలు కలుగుతాయి. దానాలు లేదా జపాలు: బుధునికి పెసలు దానం ఇవ్వండి అలాగే జపాలు చేయండి శనికి జపాలు చేయడం నువ్వులు ధానం ఇవ్వుట మంచిది కేతువుకు ఉలువలు దానం చేయుట జపాలు చేయుట మంచిది. అదృష్ట సంఖ్యలు: 08, 17, 26. 

మరింత సమాచారం తెలుసుకోండి: