‘ అన్ని దానాలలోనూ అన్నదానం మిన్న’ అన్నారు. అన్నదానం ఎవరు ఎప్పుడు చేసినా మంచిదే, అయితే, మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞఫల దక్కడంతోపాటు పితృదేవతలు సంతృప్తి చెందుతారని ప్రతీతి. 
‘భాద్రపద బహుళ ఫాఢ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు గల కాలాన్ని మహాలయ పక్షం అంటారు.

మహాలయ అమావాస్య పితృదేవలకు ఎంతో విశిష్ఠమైనది. మహాదాతయైన కర్ణుడు కురుక్షేత్రంలో అర్జునుని చేతిలో మృతిచెందిన తర్వాత స్వర్గలోకానికి వెళతాడు. అక్కడ ఆయనకు అన్నీ దొరుగుతాయి. కానీ అన్నం లభించదు. అన్ని దానాలు చేసినా అన్నదానం చేయకపోవడంవల్లే ఇలా జరిగిందని తెలుసుకుంటాడు.

తిరిగి భూలోకానికి వచ్చి అన్నదానం చేసి ముక్తి పొందుతాడు. నాటినుండి ప్రజలు ప్రతి భాద్రపద బహుళ పాఢ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షంగా జరుపుకుంటూ, ఆ పక్షంలో పితృదేవల పేరిట అన్న దానం, శ్రాద్ధకర్మలు చేయటం ప్రారంభించారు. మహాలయ పక్షంలో చేసిన దాన ధర్మాలు తండ్రి, తాత, ముత్తాతలకే గాక వారి సంరంక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు చేరతాయని ప్రతీతి.

మరింత సమాచారం తెలుసుకోండి: