ఈ కలికాలంలో మానవులు త్రివిధములైన ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనే దు:ఖాలకు లోనైపోతున్నారు. ఇతి బాధలను తీర్చెవాడు ఈశ్వరు డొక్కడే. యోగ మూర్తియైన శివుడు నిరాడంబరుడై శివతాండవ నటనా కేళి వినోదుడై ప్రథమగణ పరివేష్టితుడై లయ స్వరూపుడై విరాజిల్లుతూ జ్ఞాన దాయకుడుగా ఆరాధింపబడుతూ లింగ స్వరూపుడై సకల చరాచర సృష్టి, స్థితి లయల స్వరూపాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అట్టి పరమేశ్వరుడు నిర్వికారు డు, సజ్జనులను తన మనస్సులో ఉంచుకొనేవాడు, సకల శుభాలతో కూ డిన వాడు 'శివుడు' అంటే బ్రహ్మానంద స్వరూపుడు.
శివుడు విశ్వరూపుడే, అంటే విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరా కారుడు. విశ్వానికి ఆదినాదమైన ఓంకారంలోనికి లోతుగా వెళ్లినప్పుడు అతడిని తెలుసుకోవచ్చు. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. శివరాత్రి గురించి ఒక చిన్న కథ ఉంది. ఒక సారి సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. ‘నీవు శివుని పాదాలు కనుక్కో.. నేను తలను కనుగొంటాను’ అని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు.. శివుని పాదాలు వెదుకు తూ పాతాళానికి బయల్దేరాడు. బ్రహ్మ ఆకాశమార్గాన పైకి వెళ్లాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు గాలించినా పరమేశ్వరుడి ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టంతా శివునిలోనే ఉన్నది.
 
ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒకవంక అతడు శ్వేత వస్త్రధారుడిగా అగుపిస్తాడు. మరోవంక కృష్ణవర్ణుడు. అతడు విశ్వానికి అధిపతి అయినా ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి. మరోవైపు భోళాశంక రుడు. సుందరేశుడు ఆయన. సౌందర్యానికి అధిపతి. అదేసమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనే. ఆనందతాండవంలో చైతన్య శీలతనూ, ధ్యానంలోని స్థిరత్వాన్నీ, చీకటినీ, వెలుగునూ, అమాయకత్వా న్నీ, తార్కికబుద్ధినీ, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతున్నది. సాధారణంగా ప్రజలు, ‘ఈ జీవితం ఉద్దే శం ఏమిటి? ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది?’ అని అడుగుతూ ఉంటారు. 
ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వసృష్టికి కారణం లేదు. 'మహేశాత్‌ నా పరోదేవ:' మహేశర్వ రుడిని మించిన దేవుడు లేదు. 'శివ పంచాక్షరీ' మంత్రంలోని 'న-మ-శి- వా-య' అనే పంచ బీజాక్ష రాల నుండి పంచ భూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని శాస్త్రవచనం. 'శివ' అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థాలు. జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి, అను అవస్థలకు అతీ తమైన ధాన్యావస్థలో గోచరించే తురీయ తత్త్వమే శివుడు. సమస్తాన్ని ప్రకాశవంతం చేసే మూల చైతన్యమే శివ తత్త్వం. సృష్టి సమ స్తాన్నీ తన వశంలో ఉంచుకొన్న సదాశివుడు, సర్వేశ్వరుడు. 
అతడే ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, క్రియాశక్తులతో కూడిన ఈశ్వరుడు ఆ సేతు హిమచలం శివా రాధన వ్యాప్తమైవుంది.
దు:ఖాన్ని, దు:ఖ కారణాన్ని దూరం చేసేవాడు శివుడు. శివలింగం ఓ కార స్వరూపం. ఓం కార మున నుండే శివ లింగమందే శివార్చన జరుపబడు తుంది. ఈ సంసార సాగరాన్ని తరిం పజేసే ఓంకార స్వరూపుడైన రుద్రునికి నమస్కారమంటుంది యజుర్వేదం. 'రాత్రి' అంటే శుభంతో కూడిన పరమ సుఖాన్ని ఇచ్చేది. మహాశివ రాత్రి శివస్వరూపమైన బ్రహ్మా నందాన్ని ప్రసాదించది. కనుకనే ప్రతి శివరాత్రి ఒక పర్వదినంగా జరుపుకుంటారు. మానవుని తరింప చేయు వాడు శివుడు గాన శివారాధ నకు మించిన సులభోపాయం లేదు. 
మాఘ బహుశ చతుర్దశినాడు జీవాత్మ-పరమాత్మయైన శివునికి చాలా దగ్గరలో ఉంటాడు. ఆ రోజు శివుడు బృహ ల్లింగ స్వరూపంలో ఉంటాడు. అట్టి సమయాన్ని లింగొధ్బవ కాలమని అంటారు. నమక, చమకాలతో రుద్రాభిషే కం చేస్తే అనంత మైన పుణ్యఫలం లభిస్తుంది. నమకంలో పదకొండు అనువాకాలు, చమకంలో పదకొండు అను వాకాలు ఉంటాయి. నమకాన్ని ఒకసారి పూర్తిగా పఠించాక, చమకంలోని ఒక అనువాకాన్ని పఠించాలి. మొదటి అనువాకం లో శివుడు ప్రళయ రౌద్ర రూపాన్ని, రెండవ అను వాకం నుంచి తొమ్మిదవ అనువాకం వరకు శివుడే సృష్టి అంతా నిండి వున్నాడని, పది పదకొండు అనువాకాలలో 'అభయం' ప్రసాదించమని వేడుకోవడం జరు గుతుంది. పదకొండు ఏకాదశ రుద్రాలు చేస్తే ఒక 'లఘురుద్రం' అవుతుంది. 
పదకొండు 'లఘురుద్రాలు' చేస్తే ఒక 'మహారుద్రం' అవుతుంది. పదకొం డు మహారుద్రాలు చేస్తే ఒక అతి రుద్రం' అవుతుంది. ఇలా రుద్రాభిషేకం చేసి తరిస్తారు. విభూతిధారణ చేసి ఎవరైతే శివలింగ దర్శనం చేస్తారో వారి సర్వ పాపాలు నశిస్తాయి. ఒక బిల్వ దళాన్ని 'శివ' నామాన్ని తలుస్తూ, చేత పట్టు కున్న ఆ శివలింగ దర్శన భాగ్యఫలం దక్కుతుందని శివపురాణోక్తి. 'ఓం నమశ్శివాయ' పంచాక్షరీ మంత్రాన్ని పఠిం చినంత మాత్రానే సర్వ పాపహరణ జరుగుతుంది. దు:ఖ భూయిష్టమైన మానవ జీవితానికి తరుణోపాయానికై లింగంపై నీళ్లు పోస్తే చాలు మన కష్టాలు కడతేరుస్తాడట. 
శివుణ్ని నిత్యం ఆరాధిస్తే, భోగభాగ్యాలు సిద్ధి స్తాయని, దీర్ఘరోగాలు అనుభవించు వారు రుద్ర పాఠయుక్తంగా అభిషేకం చేసినట్లైతే దీర్గవ్యాధి నుండి విముక్తు లవుతారు. శివరాత్రి లింగార్చన, జాగరణ, ఉపవాసం ఎంతో ఉత్కుృ ష్టమైనది. మానవులు అల్ప విషయసుఖాల కొరకై జీవితాన్ని ధార పోయక శాశ్వతమైన, పరిపూర్ణ మెనట్టి ఆత్మా నందాన్ని పొందుటకు సాంసారిక క్లేషాలను అధిగమించుటకు కలియుగంలో శివారాధన ఒక్కటే శ్రేష్టమై న మార్గం. ఈ ప్రపంచం అశా శ్వత మనీ, బ్రహ్మ మొక్కటే శాశ్వత మనీ గ్రహించి, మన బుద్ధిని మేల్కొల్పడమే జాగరణం. శివనామస్మరణ చేసు కొంటూ జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని ఆ సదాశివుణ్ణి సర్వదా ప్రార్ధిద్దాం!


మరింత సమాచారం తెలుసుకోండి: