ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ.. ధర్మప్రబోధం చేస్తుండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి
“ అసలు గురువు అవసరమా?గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?” అని ప్రశ్నించాడు. 

Image result for hindu priest

గురువుగారు నవ్వుకుని , మీరేం చేస్తుంటారని అడిగారు. నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.


అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.


తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ.. తిరుగుతూ.. వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు. రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.పా..పం! అందుకే వీడికి గురువు కావాలి.ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది. గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.అలాగే మరోక  సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. 

Image result for hindu priest clipart

ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పేడు.ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.

సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పాడు.అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పారు.సాధకుడు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు. అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు. 


అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.గురువుగారు ఈ విధమగా వివరించారు.నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు.అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమ,కరుణలతో నింపు.ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు.హృదయాన్ని సాధన(ధ్యానం) నమ్మకం అనే నూనెతో నింపు.అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.” అని జ్ఞాన బోధ చేసారు ఆసాధకునకు.నీతి:-మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానం తో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించ లేకపోతున్నాము.


మన అజ్ఞానం ఎంతటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ నూనెకు తేడా తెలియనటు వంటి చీకటి స్ధితిలో ఉన్నాము.మరి ఈచీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.ఆ గురువు సాన్నిధ్యంలో కామ,క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం  పవిత్రమవుతుంది.
అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: